పోలంపల్లిలో కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చిన బండి సంజయ్

దిశ, తిమ్మాపూర్: పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.

Update: 2022-03-13 09:16 GMT

దిశ, తిమ్మాపూర్: పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లికి గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు కనకం అనిల్‌తో పాటుగా పలువురు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలోలో చేరారు. ఈ సందర్భంగా కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ చాలా వేగంగా విస్తరిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల పక్షాన పోరాడే శక్తి ఒక్క బీజేపీకే ఉందన్నారు. అందుకే గ్రామాల నుంచి, పట్టణాల నుంచి పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. రాచరిక పోకడలతో నియంత పాలనకు తెలంగాణ ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

అలాగే బూత్ లెవల్‌లో పార్టీని ప్రతిష్ట పరచడం వల్ల ఎన్నికల్లో గెలుపు సునాయాసమవుతుందని వారికి సూచించారు. ఎంతమంది పీకేలను సీఎం కేసీఆర్ తీసుకొచ్చినా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టలేరని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్ళపెళ్లి శ్రీనివాస్ గౌడ్, తిమ్మాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, ప్రధాన కార్యదర్శి కిన్నెర అనిల్, ఉపాధ్యక్షులు ఒడ్నాల రవీందర్, అల్లెపు కుమారస్వామి, రేగూరి సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News