దయనీయంగా కాంగ్రెస్ పరిస్థితి.. మాణిక్యం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రధాని మోడీ సారథ్యంలో బీజేపీ పార్టీ సత్తా చాటుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రధాని మోడీ సారథ్యంలో బీజేపీ పార్టీ సత్తా చాటుతోంది. కౌంటింగ్ జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో రాజులమని అనుకుని పేదలను ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వాలు తూడ్చి పెట్టుకొని పోనున్నాయి. అన్ని రాష్ట్రాలు కూడా మోడీ నాయకత్వానికి జై కొట్టనున్నాయి. రాచరిక పాలనలు చేస్తున్న వారి రోజులకు బ్రేక్ పడనున్నాయ్ అంటూ తెలంగాణను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటికే జరుతున్న లెక్కింపులో పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ లీడ్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 300 సీట్లు కైవసం చేసుకుంటామని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. పంజాబ్‌లో గతంతో పోల్చితే బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందని చెప్పారు. 2024లోనూ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.