నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి: కొమురయ్య

దిశ, పెద్దపల్లి టౌన్: పేదలకు, దళితులకు, గిరిజన, బహుజన వర్గాలకు..Congress leader Komuraiah hits out at CM KCR

Update: 2022-03-10 10:02 GMT

దిశ, పెద్దపల్లి టౌన్: పేదలకు, దళితులకు, గిరిజన, బహుజన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాయ మాటలతో తీవ్ర ద్రోహం చేశాడని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి కనీస అవసరమై సొంత ఇంటిని అందకుండా చేసిన ద్రోహి అని, బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 1, 91,126 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా కేవలం 91,142 ఉద్యోగాల ప్రకటన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది దాదాపు 99.984 ఉద్యోగాలు మాయమయ్యాయని.. కేవలం ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకే ఉద్యోగాల ప్రకటన చేశారని ధ్వజమెత్తారు. 2018 ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్ల కోసం హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ప్రస్తావన ప్రకటనలో లేకపోవడం బాధాకరమన్నారు. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్.కె. అక్బర్ అలీ, టీపీసీసీ ఎస్సీ విభాగం కన్వీనర్ పేర్క సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కె. సర్వర్ పాషా, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పి. ఎస్. విజయ్ కుమార్, నాయకులు కొదాది ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News