vakula Matha Temple: శ్రీవకుళమాత ఆలయాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
Vakula Matha Temple has been inaugurated by CM Jagan| తిరుపతి సమీపంలోని పేరూరు బండపై పునర్నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ప్రారంభంచారు. ఈ ఈ సందర్భంగా
దిశ, ఏపీ బ్యూరో : Vakula Matha Temple has been inaugurated by CM Jagan| తిరుపతి సమీపంలోని పేరూరు బండపై పునర్నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ప్రారంభంచారు. ఈ ఈ సందర్భంగా ఆలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నిధులతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వకుళమాత ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.
శ్రీవకుళమాత ఆలయం వద్ద 83 ఎకరాల 42 సెంట్ల భూమి ఉందని, ఈ ప్రాంతంలో టీటీడీ కల్యాణ మండపం, అతిధి భవనం నిర్మిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. దాదాపు 20 కేజీల బంగారంతో ఆలయ గోపురానికి 5 కలశాలు టీటీడీ సహకారంతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతకుముందు ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, నారాయణస్వామి, రోజా, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.