ఢిల్లీలో ఎంపీలకు సీఎం కేసీఆర్ చెప్పింది ఇదే..!

ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రం మెడలు వంచేవరకు పార్లమెంట్‌లో పోరు కొనసాగించాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

Update: 2022-04-04 15:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రం మెడలు వంచేవరకు పార్లమెంట్‌లో పోరు కొనసాగించాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎంపీలతో మధ్యాహ్నం భేటీ అయ్యారు. సుమారు 3 గంటలు సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం తెలంగాణపై అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, ఈ తరుణంలోనే పార్లమెంట్‌లో మరింతగా గళం వినిపించాలని సూచించినట్లు సమాచారం. సమావేశాల్లోనే ఒత్తిడిపెంచితేనే ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ వస్తుందని, ఈ నెల 11న ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నందున కేంద్రంపై మరింత ఒత్తిడి పెరగనుందని కేసీఆర్ పేర్కొన్నారు. దూకుడును ప్రదర్శిస్తేనే కేంద్రం దిగివస్తుందని, ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉభయ సభల్లో నిరసనలతో పాటు మీడియా సమావేశం నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టాలని సూచించినట్లు తెలిసింది. ఢిల్లీలో జరిగే ధర్నాను ఎంపీలు లీడ్ చేయాలని పేర్కొన్నట్లు సమాచారం.

Tags:    

Similar News