China Provokes India: భారత్‌ను రెచ్చగొడుతోన్న చైనా

China Provokes India Again, Chinese Aircraft Flies Close to LAC in Ladakh| భారత సరిహద్దు దేశం చైనా దుశ్చర్యకు పాల్పడుతోంది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద శుక్రవారం చైనాకు చెందిన ఓ విమానం భారత సరిహద్దులోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది.

Update: 2022-07-08 10:21 GMT

న్యూఢిల్లీ: China Provokes India Again, Chinese Aircraft Flies Close to LAC in Ladakh| భారత సరిహద్దు దేశం చైనా దుశ్చర్యకు పాల్పడుతోంది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద శుక్రవారం చైనాకు చెందిన ఓ విమానం భారత సరిహద్దులోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం చైనాను హెచ్చరించింది. రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.

ఇటీవల చైనా గగనతల నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పేర్కొంది. గత నెలలో కూడా వాస్తవ నియంత్రణ రేఖలోకి చైనా విమానం వచ్చిందన్నారు. ఇలాంటి దుస్సాహసాలకు పాల్పడొద్దని భారత్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కాగా, గతంలో వాస్తవ నియంత్రణ రేఖలోకి ప్రవేశించరాదని చైనా-భారత్ ఒప్పందం చేసుకున్నాయి. అయినా చైనా నిబంధనలు ఉల్లంఘిస్తోందని భారత వైమానిక దళం పేర్కొంది.

Tags:    

Similar News