ఆ రోజు ఏం జరిగింది.. ఆ నలుగురు మాజీ ని ఎందుకు కలిశారు..?
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు.. అనేది అక్షర latest telugu news..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు.. అనేది అక్షర సత్యం. బోధన్ లో శివాజీ విగ్రహం వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది. చివరకు అధికార పార్టీ నేత హస్తం ఉన్నట్లు గుర్తించి పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ ఘటనకు వారం రోజుల ముందుగా మరో రాజకీయ వ్యవహారం చోటు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. వేరు వేరు పార్టీలకు చెందిన 'ఆ నలుగురు' నాయకులు ఎందుకు కలిశారు..? అసలేం మాట్లాడారు..? బోధన్ తో పాటు ఇతర నియోజకవర్గంలో ఏం జరుగుతుంది..? అనేది చర్చనీయాంశంగా మారింది. కీలకమైన రాజకీయ నేతల్లో ఇప్పుడు 'ఆ నలుగురు' నేతలపైనే గుసగుసలు వినిపిస్తూ ఉండటం విశేషం.
ఆ నలుగురు ఎవరు?
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మాజీ కీలక నేతను వేర్వేరు పార్టీలకు చెందిన ముగ్గురు నేతలతో పాటు ఓ ఉద్యోగ సంఘం జిల్లా నేత కలిశారు. సుమారు ఒక గంట విస్తృతంగా చర్చలు జరిపారు. అయితే ఇంతకు ఈ నలుగురు నేతలు ఎవరు? అనేది కీలకమైన చర్చగా మారింది.మొదటి వ్యక్తి టీపీసీసీ స్థాయి నేత ఓ నియోజకవర్గంలో నుంచి టికెట్ ఆశిస్తున్నారు. మరో వ్యక్తి కమలం పార్టీ అయినప్పటికీ పోటీలో నిలిచేందుకు సిద్ధం అవుతున్న ఆర్థిక ఇబ్బందులు మెకాలే అడ్డుకున్నాయి. మూడో వ్యక్తి ఉద్యోగ సంఘంలో కీలక నేత. ఈయన మరో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నంలో ఉన్నారు.
ఈ ముగ్గురు ప్రత్యేకంగా మాజీ ముఖ్య నేతను కలిసి చర్చించడం గమనార్హం. అయితే వీరితో పాటు అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన మరో నేత నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు. లేదా ఏదో ఒక పార్టీ నుంచి టిక్కెట్ తెచ్చుకునే ప్రయత్నం లో ఉన్నారు. ఈ నలుగురు కలవడమే ఇప్పుడు కీలకమైన చర్చగా మారింది. ఇదిలా ఉంటే వీరి కలయిక అనంతరం వారం రోజుల్లో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన వ్యవహారం వివాదాస్పదం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఎవరికి వారే సమీ'కారణాలు'..
నియోజకవర్గ ప్రాతినిధ్యం కోసం ఎవరికి వారే సమీకరణాలు చేస్తున్నారు. ప్లేస్.. మైనస్.. కారణాలను వెతుక్కుంటూ పావులు కదుపుతున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం తో ఆశావాహుల పార్టీల నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. పాత వారు ఎలా ఉన్నా.. కొత్త వారు మాత్రం ఏ పార్టీ ఎలా ఉంటుందని, సమీకరణాలు ఎలా ఉంటాయని ఆరాతీస్తున్నారు. మరోవైపు ఆయా పార్టీల కీలక నేతలను కలసి తమ మనస్సులో మాట బయట పెడుతున్నారు.
ఇలా ఇద్దరూ ఉద్యోగ సంఘాల నేతలు, ఇద్దరు తటస్థులు, మాజీలు సైతం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇలా అధికార పార్టీ మినహా బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలపై దృష్టి సాధించారు. ముఖ్యంగా కాంగ్రెస్ టికెట్ ను ఆర్మూర్ నుంచి ఉద్యోగ సంఘం నేత ఆశిస్తుండగా.. బీజేపీ టిక్కెట్ ను ఉద్యోగ విరమణ పొందిన నేత నిజామాబాద్ నుంచి ఆశిస్తున్నారు. ఇలా ఎవరికీ వారే పావులు కదలడంతో బోధన్ లో ఆ నలుగురి కలయిక ఇప్పుడు రాజకీయాలతో పాటు పోలీసు శాఖలో కీలకంగా మారింది.