సీఎం జగన్ మరో నీరో.. వారికి ఆయన ఏం సమాధానం చెప్తారు: Chandrababu Naidu
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం - chndrababu naidu comments on ys jagan governance
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కోతలపై చంద్రబాబు నాయుడు గురువారం ట్వీట్ చేశారు. విద్యుత్ కోతలతో ప్రసూతి ఆస్పత్రిలో బాలింతల పరిస్థితి వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారంటూ చంద్రబాబు ట్విటర్‌లో తెలిపారు. గ్రామాల్లో అనధికార పవర్ కట్‌లతో ప్రజలు అల్లాడిపోతున్నారని వ్యాఖ్యానించారు. విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆస్పత్రిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పడుతున్న బాధలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. నాడు మిగులు విద్యుత్ తో వెలుగులు నిండిన మన రాష్ట్రంలో నేటి ఈ చీకట్ల కు కారణం ఎవరు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు కరెంట్ ఎందుకు పోతోంది.? భారీగా పెరిగిన బిల్లులు ప్రజలు కిమ్మనకుండా కడుతున్నా ఈ కోతలు ఎందుకు? ఓవైపు గ్రామ గ్రామాన ప్రజలు కరెంట్ లేక రోడ్డెక్కుతుంటే.. వాలంటీర్లకు సన్మానం అంటూ రూ.233 కోట్లు తగలేస్తూ పండుగ చేసుకుంటున్న ఈ ముఖ్యమంత్రిని నీరో (రోమ్ చక్రవర్తి) కాక ఇంకేమనాలి? అని చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. విద్యుత్ కోతలను ప్రశ్నించిన సామాన్య ప్రజలపై బెదిరింపులు మాని..సమస్యను పరిష్కరించాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయింది. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారు. గ్రామాల్లో అనధికార పవర్ కట్ లతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పడుతున్న బాధలకు ఈ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెపుతారు?(1/3) pic.twitter.com/yQW24jmnaz
— N Chandrababu Naidu (@ncbn) April 7, 2022