Loneliness: లోన్లీనెస్‌.. ఈ వ్యాధులకు అవకాశమిస్తున్నట్లే..?

ఒంటరితనం(loneliness) కొంతమందికి ఆనందాన్నిచ్చినప్పటికీ.. మరికొంతమందికి మాత్రం అదొక మానసిక వ్యాధి కిందకు పడిపోతుంది.

Update: 2025-01-07 10:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒంటరితనం(loneliness) కొంతమందికి ఆనందాన్నిచ్చినప్పటికీ.. మరికొంతమందికి మాత్రం అదొక మానసిక వ్యాధి కిందకు పడిపోతుంది. అందరితో కలిసి ఉండటం, తిరగడం, ముచ్చట్లు.. ఇలా టైమ్ వేస్ట్ వ్యవహారాలంటూ కొందరు వారి లైఫ్ మీద ఫోకస్ పెడతారు. కానీ పలువురు జనాల్లో ఉండి.. సడన్‌గా దూరమై ఏదొక విషయంలో బాధపడుతూ నాలుగు గోడల మధ్య ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు. లోన్లీనెస్.. ఇటీవల అనేక మందిని వేధిస్తున్న మెంటల్ హెల్త్ ఇష్యూస్‌లో ఒంటరితనం ఒకటి. ఈ సమస్య నుంచి బయటకు రాకపోతే మరిన్ని కొత్త సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మెదడు సామర్థ్యంపై ప్రభావం..

మెదడు చిన్న చిన్న విషయాలకే తెగ కంగారు పడుతుంటుంది. అలాంటిది తరచూ ఒంటరితనంతో బాధపడితే మెదడు సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మెమోరీ లాస్ అవ్వడం, ఇతరులతో మాట్లాడాలని అనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ జెరియాట్రిక్ సైకియాట్రిటీ (International Journal of Geriatric Psychiatry)అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా ఈ సమస్య కారణంగా అల్జీమర్స్(Alzheimers) వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

గుండెపై ఎఫెక్ట్..

ఒంటరితనం పరోక్షంగా ఫిజికల్ హెల్త్‌(Physical health)పై కూడా ఎఫెక్ట్ చూపుతుంది. ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు అతిగా తినే రుగ్మత బారిన కూడా పడవచ్చు. ఈ పరిస్థితి హార్మోన్ల అసమతుల్యతకు, మధుమేహానికి(diabetes), అధిక రక్తపోటుకు దారితీస్తుంది. క్రమంగా గుండె జబ్బుల రిస్క్(Risk of heart disease) పెరుగుతుందని బ్రిటీష్ ఆన్‌లైన్ మెడికల్ జర్నల్ పేర్కొంటున్నది.

టైప్ -2 డయాబెటిస్..

లోన్లీనెస్ వల్ల మెంటల్ డిజార్డర్స్ మాత్రమే కాదు, శారీరక అనారోగ్యాలకూ అది దారితీస్తుందని నిపుణులు చెబున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలం పాటు ఒంటరితనంతో కుంగిపోయే వారిలో టైప్ -2 డయాబెటిస్(Type-2 diabetes) ప్రమాదం రెట్టింపు అవుతుందని యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ జర్నల్(Journal of the European Association for the Study of Diabetes) కూడా పేర్కొన్నది.

వృద్ధాప్యం తొందరగా రావడం..

ఎక్కువ కాలంపాటు లోన్లీనెస్ అనుభవించే వ్యక్తుల్లో వృద్ధాప్యం(old age) త్వరగా వస్తుందని పలు అధ్యయనాలు ఇప్పటికే పేర్కొన్నాయి. ఎందుకంటే ప్రతి కూల ఆలోచనలు శరీరంలోని హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపడం కారణంగా ఇలా జరుగుతుంది. దీంతోపాటు ధూమపానం(smoking), మద్యపానం(drinking) అలవాట్లు కూడా ఉంటే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News