Chalaki Chanti : జబర్దస్త్ చలాకీ చంటి సంచలన కామెంట్లు.. ఇకపై!!

జబర్దస్త్ చలాకీ చంటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-10-14 06:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ చలాకీ చంటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా ఫుల్ ఫేమ్ దక్కించుకున్న ఈయన ఏకంగా అగ్ర హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించుకుని మరింత పాపులర్ అయ్యాడు. చాలా మూవీల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు. చంటి కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూకు హాజరై సంచలన కామెంట్లు చేశాడు. చంటి మాట్లాడుతూ.. ఇకపై జబర్దస్త్ చేయనని తేల్చి చెప్పాడు. చంటిని జబర్దస్త్ వారే వద్దన్నారని, ఏ కారణం చేత చంటిని వద్దు అన్నారో కూడా తనకు తెలియదని వెల్లడించారు.

తను ఉండే విధనాన్ని బట్టి అంతా ఈగో అని అనుకుంటారు కానీ.. దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అని అనుకుంటానని చంటి ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తన మీద నెగిటివ్ ప్రచారం కూడా చేశారని అన్నాడు. అలాగే సంబంధం లేని విషయాల్లో చంటిని ఇరికించారని కాస్త ఎమెషనల్ అయ్యాడు. అవకాశాలు రాకుండా చేశారని కమెడియన్ వాపోయాడు. ఇకపోతే ఈ కమెడియన్ కు గత ఏడాది హార్ట్ ఎటాక్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడిప్పుడే చంటి కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంటి కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Similar News