Chaitanya- Shobhitha: నాగచైతన్య కోసం అలాంటి త్యాగం చేసిన శోభిత..? షాక్‌లో ఫ్యాన్స్

అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-11-13 08:07 GMT

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 4న జరగనున్నట్లు సమాచారం. ఇక అప్పటి నుంచి వీరికి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా శోభిత ధూళిపాళ నాగచైతన్య కోసం ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం సినిమాలే అని తెలుస్తుంది. సమంత ఎప్పుడైతే ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌లో నటించారో ఆ వెబ్ సిరీస్ కారణంగానే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని అదే విడాకులకు కారణమైంది అంటూ ఒకానొక సమయంలో వార్తలు కూడా హల్‌చల్ చేశాయి. ఇలా సమంత నాగచైతన్య జీవితంలో జరిగిన తప్పు తిరిగి శోభిత నాగచైతన్య విషయంలో జరగకుండా ఉండటం కోసం వీరిద్దరూ ముందస్తు జాగ్రత్త తీసుకున్నారని తెలుస్తుంది. అందుకే నాగచైతన్య పెళ్లికి ముందే శోభితకు ఎలాంటి బోల్డ్ వెబ్ సిరీస్‌లు కానీ సినిమాలలో కానీ నటించకూడదని కండిషన్ పెట్టారట. ఇక ఈ కండిషన్‌కి శోభిత కూడా ఒప్పుకుందని తెలుస్తోంది. నాగచైతన్య పట్ల ఎంతో ప్రేమ అభిమానం ఉన్న శోభిత తనతో కలిసి సంతోషంగా జీవించడం కోసం ఈ త్యాగం చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Tags:    

Similar News