కారం, చింతపండు, జీలకర్రలో కరోనా.. సర్వేలో ఆసక్తికర విషయాలు?
దిశ, తెలంగాణ బ్యూరో: చింతపండు వినియోగం ఎక్కువున్న ప్రాంతాల్లో కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైనట్లు సెంట్రల్, భారతీయ విద్యాపీఠ్యూనివర్సిటీ సంయుక్త సర్వేలో తేలింది.
దిశ, తెలంగాణ బ్యూరో: చింతపండు వినియోగం ఎక్కువున్న ప్రాంతాల్లో కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైనట్లు సెంట్రల్, భారతీయ విద్యాపీఠ్యూనివర్సిటీ సంయుక్త సర్వేలో తేలింది. జీలకర్ర వినియోగం ఎక్కువున్న ప్రాంతాల్లో కొవిడ్ కేసులు, మరణాలు తక్కువగానే ఉన్నాయని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మొదటి, రెండు, మూడో వేవ్‌ల పరిస్థితిని బేరీజు వేసుకొని ఈ సర్వే నిర్వహించినట్లు సైంటిస్టులు వివరించారు. దీనికి ఇప్పటికిప్పుడు సైంటిఫిక్ రీజన్ స్పష్టం చేయకపోయినప్పటికీ, పూర్తిస్థాయిలో కారణాలపై అన్వేషణ జరుగుతున్నట్లు సర్వే చేసిన ప్రొఫెసర్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో చింతపండు వాడకం ఎక్కువగా ఉన్నదని, దాని వలనే మూడు వేవ్‌లలో కరోనా ర్యాపిడ్ స్ప్రెడ్ జరిగినట్లు పేర్కొన్నారు. అయితే అల్లం, వెల్లుల్లి, పసుపు వినియోగం ఎక్కువున్న రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్రత తక్కువగా ఉన్నదని, రివకరీ తీరు కూడా ఫాస్ట్‌గా ఉన్నదని సర్వేలో వెల్లడించారు.
దేశంలో సెకండ్ ప్లేస్.. సగటున 173 గ్రాములు
చింతపండు వినియోగంలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. మొదటి స్థానంలో పాండిచ్చేరి ఉండగా, రెండోస్థానంలో తమిళనాడు ఉన్నది. అయితే చింతపండు వినియోగంలో సౌత్స్టేట్లు అగ్రభాగంలో ఉండటం గమనార్హం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కో వ్యక్తి సగటున నెలకు 173 గ్రాములు చింతపండును వినియోగిస్తున్నట్లు సర్వేలో తేలింది. అత్యధికంగా పాండిచెర్రిలో 225 గ్రాములు, తమిళనాడులో 138 గ్రాములు, కేరళలో 98 గ్రాములు చొప్పున వాడుతున్నారు.
జీలకర్రలో చండీఘడ్ ముందు
జీలకర్ర వినియోగంలో చండిఘడ్ దేశ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్నది. ప్రతీ నెల ఒక్కో వ్యక్తి సగటున 77 గ్రాముల జీలకర్రను తీసుకుంటున్నారు. ఆ తర్వాత స్థానంలో హర్యానాలో సగటున 46 గ్రాములు చొప్పన వినియోగం జరుగుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో కేవలం 34 గ్రాములే వాడుతున్నట్లు సర్వేలో తేలింది. ఆయా స్టేట్లలో కరోనా తీవ్రత తక్కువగా ఉన్నట్లు వివరించారు.
చిల్లీ సిచ్వేషన్
చిల్లీ సిచ్వేషన్లో కూడా తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలోనే ఉన్నాయి. ప్రతీ వ్యక్తి సగటున నెలకు 124 గ్రాములు చొప్పున తీసుకుంటున్నారు. గోవాలో 107 గ్రాములు, కర్ణాటకలో 117 గ్రాములు, కేరళలో 161,ఢిల్లీలో 45 చొప్పను తీసుకుంటున్నారు.
కేసుల తీవ్రత
చింతపండు, చిల్లీ(మిర్చిపౌడర్) అధికంగా వాడుతున్న పాండిచ్చేరిలో ప్రతీ పది లక్షల మందిలో 18,583 కరోనా కేసులు చొప్పున తేలగా, 14,476 మంది రికవరీ అయ్యారు. మరో 374 మంది చొప్పున మరణించినట్లు సర్వేలో నిర్ధారణ అయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ పది లక్షల మందిలో 17,736 మందికి కొవిడ్ సోకగా, 15,247 మంది కోలుకున్నారు. 139 మంది చొప్పున మరణాలు సంభవించాయి. తమిళనాడులో ప్రతీ పది లక్షల మందిలో 7,586 మందికి కరోనా నిర్ధారణ కాగా, 6,819 మంది రికవరీ అయ్యారు. మరో 123 మంది చొప్పున డెత్స్ జరిగాయి.
స్పైసీ వినియోగం సగటున (గ్రాములు/30 రోజులు).. కేసులు తీవ్రత