Bumper offer: బంపర్ ఆఫర్.. ఫుడ్ ఆర్డర్ చేయండి.. 42వేలు ఆదా చేయండి..!
చాలా మంది తరచూ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్(Food order) చేస్తుంటారు. స్విగ్గీ(Swiggy), జొమాటో(Zomato).. ఇలా పలు యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టి.. ఆన్‌లైన్ ద్వారా ఎక్కువగా పేమెంట్స్ చేస్తుంటారు.
దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది తరచూ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్(Food order) చేస్తుంటారు. స్విగ్గీ(Swiggy), జొమాటో(Zomato).. ఇలా పలు యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టి.. ఆన్‌లైన్ ద్వారా ఎక్కువగా పేమెంట్స్ చేస్తుంటారు. ఫుడ్ ఆర్డర్ చేసి.. ఆన్‌లైన్‌లో మనీ చెల్లించేటప్పుడు మీరు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలిసుండదు. స్విగ్గీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్(HDFC Bank) క్రెడిట్ కార్డుతో మీరు ఫుడ్ ఆర్డర్ చేయడంతో పాటు మనీ కూడా సేవ్ చేయవచ్చు. ఈ క్రెడిట్ కార్డుతో కంగా సంవత్సరానికి 42 వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. మరీ ఈ కార్డు ఫీచర్లు, లాభాలు ఏంటి? ఫీజులు, అర్హత ఏంటనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
స్విగ్గీ వన్ మెంబర్షిప్ ఫుడ్ డెలివరీ, ఇన్‌స్టామార్ట్(Instamart), జెనీ(Genie) మొదలైన వాటి కోసం స్విగ్గీ యాప్‌లో ఫ్రీ డెలివరీలు, స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తుంది. వెల్కమ్ బెనిఫిట్ కింద కార్డుదారుడు కార్డు యాక్టివేషన్‌పై 3 నెలల పాటు కాంప్లిమెంటరీ స్విగ్గీ వన్ సభ్యత్వాన్ని పొందుతాడు. కార్డు యాక్టివేట్ అయిన రెండు మూడు రోజుల్లో స్విగ్గీ యాప్ లో ఈ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది.
అర్హత,రుసుము..
ఇందుకు అర్హతలు.. 21 నుంచి 60 ఏళ్ల మధ్యనున్నవారు కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. నెలసరి ఆదాయం 15 వేల కంటే ఎక్కువగా ఉండాలి. ఆదాయపు రిటర్న్ 6 లక్షల రూపాయలు ఉండాలి. అక్టోబర్ 1, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 మధ్య హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్, ఫిజికల్ అప్లికేషన్ల ద్వారా చేసిన దరఖాస్తులకు జీవితకాల ఉచిత ఆఫర్ లభిస్తుంది.
స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో మీరు ఏడాదికి రూ.42,000 వరకు ఆదా చేయవచ్చు. ఆన్‌లైన్ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ద్వారా రూ.18,000. 1% క్యాష్‌బ్యాక్ ద్వారా ఇతర కేటగిరీలపై రూ.6,000. స్విగ్గీ యాప్‌పై 10% క్యాష్ బ్యాక్ ద్వారా రూ.18,000 ఇలా మొత్తంగా 42 వేల రూపాయల ఆదా చేయవచ్చు.