మైనర్ చెల్లితో అన్న లైంగిక సంబంధం.. గర్భం దాల్చడంతో
దిశ, బాన్సువాడ : సభ్య సమాజం సిగ్గుపడేలా తోడబుట్టిన సొదరినే సొంత సోదరుడు గర్భవతిని చేసిన ఘటన.. Latest Telugu News..
దిశ, బాన్సువాడ : సభ్య సమాజం సిగ్గుపడేలా తోడబుట్టిన సొదరినే సొంత సోదరుడు గర్భవతిని చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ నిరుపేద కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ కుటుంబంలోని తల్లి ఏడాదిన్నర కిందట కరోనతో మృతి చెందారు. తండ్రి అంధుడు. మైనర్ అయిన సొంత సోదరిని మాయమాటలతో వంచించిన అన్న.. ఏడాదిన్నరగా ఆ బాలికతో లైంగిక సంబంధం ఏర్పర్చుకున్నాడు. శుక్రవారం రాత్రి సదరు బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలిక ఏడు నెలల గర్భవతి అని తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపి, అత్యవసర వైద్య చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ చేసిన వైద్యులు అప్పటికే కడుపులో మృతి చెందిన శిశువును తొలగించి, బాధిత బాలికను కాపాడారు. ప్రస్తుతం బాధితురాలు క్షేమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ జైపాల్ రెడ్డి తెలిపారు.