‘యు ఆర్ మై ఫ్రెండ్. ఫార్మాలిటీస్ గురించి మాట్లాడొద్దు’.. చిరు కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించిన ప్రముఖ హీరో

బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్(Bollywood star hero Amitabh Bachchan) ఏఎన్నార్ జాతీయ అవార్డు(National Award) ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.

Update: 2024-10-29 03:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్(Bollywood star hero Amitabh Bachchan) ఏఎన్నార్ జాతీయ అవార్డు(National Award) ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో సోమవారం ఏఎన్నార్ జాతీయ అవార్డు వేడుకలో అమితాబ్ చేతుల మీదుగా నిన్న (అక్టోబరు 28)టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)కి ఏఎన్నార్ నేషనల్ అవార్డు అందించారు. ఈ ఈవెంట్ కు చాలా మంది టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. చిరుకు ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానం చేశాక.. బాలీవుడ్ నటుడు అమితాబ్ అక్కినేని ఫ్యామిలీ(Akkineni family)ని, చిరంజీవిని కొనియాడారు. తెలుగు సినిమానే కాకుండా మొత్తం సినీ పరిశ్రమలో ఏఎన్నార్ సత్తా చాటారని అమితాబ్ పొగడ్తల వర్షం కురిపించారు.

ఆయన నటనతో కోట్లాదిమంది జనాల్ని అలరించారని అన్నారు. ఇంకా ఏఎన్నార్ (ANR) వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని, అందుకు నాగార్జున(Nagarjuna)కు తమ ఫ్యామిలీ మెంబర్స్ కు ధన్యవాదాలు అని వ్యాఖ్యానించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. ఏ సమయంలో కాల్ చేసిన చిరు లిఫ్ట్ చేసి మాట్లాడతారని చెప్పుకొచ్చారు. చిరంజీవి నా ప్రియమైన స్నేహితుడు అని తెలిపారు. ప్రేమ,స్నేహం, ఆతిథ్యం విషయంలో మెగాస్టార్ కు ధన్యవాదాలు అని చెప్పారు. తర్వాత చిరంజీవి.. అమితాబ్ గురించి మాట్లాడారు. సైరా (Saira) మూవీలో ఒక కామియో పాత్ర(Cameo role) కోసం అమితాబ్ ను ఎలా అడగాలో అర్థం కాలేదని అన్నారు.

అందుకోసం ఎలా అడగాలో అర్థం కాక ఫోన్ లో మెసేజ్ పెట్టానని, చూసిన వెంటనే అమితాబ్ నాకు ఆ పాత్ర ఒకే చేస్తానని అన్నారని వెల్లడించారు. దీంతో నాకు ఎంతో సంతోషంగా అనిపించిందని తెలిపారు. మూవీ మొత్తం కంప్లీట్ అయ్యాక రెమ్యునరేషన్ (Remuneration) గురించి అడిగా.. యు ఆర్ మై ఫ్రెండ్ ఫార్మాలిటీస్ గురించి మాట్లాడవద్దని ఆయన అన్నారని చిరంజీవి పేర్కొన్నారు. ఆ విషయాన్ని అయితే నేను జీవితంలో మర్చిపోలేనని.. అమితాబ్ లాంటి మంచి స్నేహితుడికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ప్రస్తుతం చిరు కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

Tags:    

Similar News