Kareena Kapoor: ప్రభాస్ ‘స్పిరిట్’లో కరీనా కపూర్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ (spirit) ఒకటి.

Update: 2024-10-20 13:22 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ (spirit) ఒకటి. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుండగా.. నటీనటులకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ‘స్పిరిట్’ (spirit)లో బాలీవుడ్ (Bollywood) బ్యూటీ కరీనా కపూర్ (Kareena Kapoor) నటిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే.. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న కరీనా (Kareena) ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ‘‘స్పిరిట్’ (spirit) సినిమాలో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ‘స్పిరిట్’ (spirit) మూవీకి సంబంధించి ఎవరు కూడా నన్ను సంప్రదించలేదు. ఒకవేళ ఈ సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది కరీనా.

Tags:    

Similar News