శివాజీ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత.. కొట్టుకున్న ఇరు పార్టీల నాయకులు....

Update: 2022-02-19 13:57 GMT

దిశ, ధర్పల్లి : మండల కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద శనివారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ‌విగ్రహం ప్రారంభోత్సవానికి ఎంపీ ధర్మపురి అరవింద్ ‌వస్తుండగా అడ్డుకునేందుకు భారీగా టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు శివాజీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ నాయకులు రైతు కండువాలు వేసుకుని, ‌బీజేపీ నాయకులు కాషాయ కండువాలు వేసుకుని పాల్గొన్నారు.

ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట ఉద్రిక్తంగా మారి ఘర్షణకు దారితీసింది. ఇందులో స్థానిక సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాల్ రాజ్ తలకు గాయాలు కాగా, ఎస్ఐ వంశీ కృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో మహిళా కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. ఇరు వర్గాలు పరస్పరంగా వ్యతిరేక నినాదాలు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. దీంతో పోలీసులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. గాయాల పాలైన బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌నాయకులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం శివాజీ విగ్రహం కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించి అనంతరం జలభిషేకం చేసి, శివాజీ విగ్రహానికి పూలమాల వేసి జై.. జైలు కొట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.


Similar News