పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలి : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

రాష్ట్ర సరిహద్దు వద్ద వాహనాలు తనిఖీ పకడ్బందీగా చేపట్టాలని

Update: 2024-11-19 14:37 GMT

దిశ, వాంకిడి : రాష్ట్ర సరిహద్దు వద్ద వాహనాలు తనిఖీ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్రంలో సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ అదనంగా ఇస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం జిల్లాకు రాకుండా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అప్రమత్తతో విడతల వారీగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

అలాగే జిల్లా నుంచి వెళ్లే పత్తి వాహనాలను సైతం తనిఖీ చేసి అనుమతులు లేకుంటే సరిహద్దు దాటకుండా నియంత్రించాలని తహసీల్దార్ రియాజ్ అలీ. ఎస్ఐ ప్రశాంత్ లను ఆదేశించారు. అనంతరం వాంకిడి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలను డీటీడీవో రమాదేవితో కలిసి తనిఖీ చేశారు. తాజా కూరగాయలు. నాణ్యమైన సరుకులతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని. వంటశాల పరిసరాలతో పాటు స్నానపు గదులు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


Similar News