కేజ్రీవాల్ ఇంటిపై దాడులు.. బీజేపీ పనే అంటున్న ఆప్
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటిపై దాడి జరిగింది. దీనిపై పార్టీ నేతలు స్పందిస్తూ ఇదంతా.. Latest Telugu News..
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటిపై దాడి జరిగింది. దీనిపై పార్టీ నేతలు స్పందిస్తూ ఇదంతా బీజేపీ పనే అని తీవ్ర విమర్శలు చేస్తోంది. తమ అధినేత కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ గూండాలు దాడులు చేశారంటూ ట్విటర్ వేదికగా ఫొటోలు షేర్ చేసింది. ఈ దాడుల్లో కేజ్రీవాల్ ఇంటిలోని సెక్యూరిటీ బేరియర్లు విరిగిపోయాయని, సీసీ కెమెరాలు ధ్వంసం చేయబడ్డాయని తెలిపారు. కేజ్రీవాల్‌పై దాడి చేసేందుకు బీజేపీ గూండాలకు ఢిల్లీ ఖాకీలు సహాయం చేశాయని వారు విమర్శించారు. అంతేకాకుండా కాశ్మీర్ పండిట్లకు పునరావాసం కల్పించాలని కోరినందుకే బీజేపీ ఈ దారుణానికి పాల్పడిందని వారు తెలిపారు. ఖాకీలు, కమలం గూండాలు కలిసి కేజ్రీవాల్‌ను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అది ఏమాత్రం జరగదని ఆప్ పార్టీ కార్యదర్శులు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం పార్టీ పోరాడుతూనే ఉంటుందని అన్నారు.
CM @ArvindKejriwal's HOUSE ATTACKED BY BJP!
— AAP (@AamAadmiParty) March 30, 2022
➡️SECURITY BARRIERS BROKEN
➡️CCTVs CAMERAS BROKEN
➡️GATE VANDALISED
➡️WITH FULL SUPPORT FROM BJP'S DELHI POLICE
Stunned by AAP's victory in Punjab, is BJP trying to kill Arvind Kejriwal ji? #BJPKeGunde pic.twitter.com/DlVffXT5nN