Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు చేదు అనుభవం.. కింద పడటంతో అంతా షాక్ (వీడియో)

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు చేదు అనుభవం ఎదురైంది.

Update: 2024-11-08 11:04 GMT
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు చేదు అనుభవం.. కింద పడటంతో అంతా షాక్ (వీడియో)
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై(Mumbai)లోని ఓ ఈవెంట్‌కు హాజరైన విజయ్.. అనుకోకుండా స్టెప్స్‌పై కిందపడ్డాడు. కిందపడిన వెంటనే పక్కన ఉన్నవారు అలర్ట్ కావడంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇక అది చూసి అక్కడున్న వారు కొందరు షాక్ అవగా.. మరికొందరు మాత్రం వీడియోలు తీయొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)కు చేదు అనుభవం ఎదురైంది.

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘VD12’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనిని గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) తెరకెక్కిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు టాక్. ఈ మూవీతో పాటు డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్(Rahul Sankrityan), రవి కిరణ్ కోలాల దర్శకత్వాల్లో కూడా రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా విజయ్ ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీడియోలో నటిస్తున్నాడు. ఇందులో రౌడీ హీరోకు జోడిగా రాధికా మదన్(Radhika Madan) నటిస్తోంది. అయితే ఈ సాంగ్ ‘సాహిబా’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి పాప్ సింగర్ జస్లీన్ రాయల్(Jasleen Royal) మ్యూజిక్ అందిస్తుండగా.. సుధాన్షు సారియా(Sudanshu Saria) తెరకెక్కిస్తోంది. త్వరలోనే ఈ పాట విడుదల కాబోతున్నట్లు విజయ్ పోస్ట్ ద్వారా కూడా వెల్లడించారు.

Full View

Tags:    

Similar News