నేరస్తులపట్ల కఠినంగా వ్యవహరించండి.. పోలీసులకు డీజీపీ ఆదేశం

ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు..

Update: 2025-04-26 16:02 GMT
నేరస్తులపట్ల కఠినంగా వ్యవహరించండి.. పోలీసులకు డీజీపీ ఆదేశం
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడు పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని, దేశంలోనే ప్రధమ స్థానాన్ని పొందిన తెలంగాణ రాష్ట్రాన్ని అదే స్థాయిని నిలుపుకునేందుకు పోలీస్ సిబ్బంది కృషి చేయాలని డీజీపీ డాక్టర్ జితేందర్ ఆకాంక్షించారు. ప్రజలు ఆశించిన స్థాయిలో పోలీసు సిబ్బంది కృషి చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని యూనిట్ల నుంచి వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో డీజీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజలకు శాంతి భద్రతల సమస్యలు ఎదురైనప్పుడు మాత్రమే పోలీస్ స్టేషన్లకు వస్తారని వాటినీ పరిష్కరించినప్పుడే రాణించగలుగుతారని అన్నారు. డయల్ 100 కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సదా అవకాశము పోలీస్ శాఖకు దక్కిందని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించినప్పుడు వారు ఎవరికి ఫిర్యాదు చేయరని అభిప్రాయపడ్డారు. నేరస్తులకు శిక్షలు పడేవిధంగా దర్యాప్తు చేసి ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యవస్థ 165 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిందని, తెలిపారు. . శాంతిభద్రతల అడిషనల్ డీజీపీ మహేశ్ ఎం భగవత్ నకిలీ విత్తనాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. నకిలీ విత్తనాలను తయారు చేసే నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఏఐజి రమణకుమార్, డి.ఎస్.పి సత్యనారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Similar News