Post office schemes: FD కంటే ఎక్కువ వడ్డీని అందించే.. బెస్ట్ పోస్టాఫీస్‌ పథకాలు..!!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు డబ్బు ఎలా ఆదా చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు.

Update: 2024-11-18 10:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బు ఎలా ఆదా చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు. ఇందుకోసం పలు మార్గాలలో వెళ్తుంటారు. చాలా మంది స్మాల్ సేవింగ్స్ పథకాల్లో పెట్టుబడి పెడుతుండటం చూస్తూనే ఉంటాం. ఇలాంటి చిన్న పొదుపు స్కీమ్స్ కు పోస్టాఫీస్(post office) కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఈ పథకాల్లో పెట్టుబడి పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. సేవింగ్ స్కీమ్స్‌కు పోస్టాఫీస్ బెస్ట్ ఆప్షన్. పైగా ఇందులో రిటర్న్ కు హామీ కూడా ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్స్.. ఫిక్స్డ్ డిపాజిట్ల(Fixed Deposits) కంటే అధిక వడ్డీని కూడా ఇస్తాయి. మరి ఇలాంటి ఉత్తమ పథకాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (MIS)..

ఈ పథకంలో ఏడాదికి 1500 రూపాయల పెట్టబడి పెట్టాల్సి ఉంటుంది. మాక్సిమం 9 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయం స్కీమ్ కు వడ్డీ(interest) రేటు 7. 4 శాతంగా ఉంటుంది. ప్రతి నెల వడ్డీ మీకు అందుతుంది. దీని గడువు ఐదేళ్లు. అవసరమైతే.. పొడిగించుకోవచ్చు కూడా.

కిసాన్ వికాస్ పత్ర పథకం..

కిసాన్ వికాస్ పత్ర పొదుపు పథకానికి(Kisan Vikas Patra Savings Scheme) లిమిట్ ఏమీ ఉండదు. ఇది ఒక పొదుపు సర్టిఫికేట్. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి పన్ను రాయితీలు(Tax concessions) లభించవు. హామీతో కూడిన రాబడిని మాత్రమే అందిస్తుంది. 7.5% వార్షిక సమ్మేళన వడ్డీ రేటు ఉంటుంది. గడువు 115 నెలలు.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS)

60 ఏళ్ల పైబడిన వారు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్(Senior Citizen Saving Scheme) ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో మొత్తం ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా 30 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టవచ్చు. ఇన్ కమ్ టాక్స్ చట్టం(Income Tax Act)లోని 80C సెక్షన్ కింద పన్ను ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారికి 8. 2 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. ఈ స్కీమ్ గడువు 5 ఏళ్లు ఉంటుంది. కావాలంటే మరో 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంటుంది.

మహిళా సమ్మాన్ పొదుపు సర్టిఫికెట్..

ఈ పథకం ఇండియన్ మహిళల్లో బాగా ఫేమస్ అయ్యింది. ఇందులో కేవలం మహిళలకు మాత్రమే అవకాశం ఉంటుంది. రెండేళ్ల గడువు గల ఈ పథకంలో పెట్టుబడి పెట్టినా ఎలాంటి పన్ను లాభం కలగదు. అలాగే మహిళా సమ్మాన్ పొదుపు సర్టిఫికెట్‌(Mahila Samman Savings Certificate)లో 7. 5 శాతం సమ్మేళన వడ్డీ రేటుతో రిటర్న్ ఇస్తుంది.

జాతీయ పొదుపు సర్టిఫికెట్లు..

జాతీయ పొదుపు సర్టిఫికెట్లు స్కీమ్(National Savings Certificates Scheme) గడువు 5 ఏళ్లు. ఈ స్కీమ్ సెక్యూరిటీని ఇస్తూనే మంచి రిటర్న్స్ అందిస్తాయి. ఇందులో పెట్టుబడిపై వడ్డీ స్కీమ్ గడువు ముగిసినప్పుడే చెల్లిస్తారు. ఈ పథకంలో రూ. 1000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. జాతీయ పొదుపు సర్టిఫికెట్లలో పెట్టుబడి పెట్టిన వారికి టాక్స్ మినహాయింపు లాభం చేకూరుతుంది. 7.7 శాతం వార్షిక సమ్మేళన వడ్డీ రేటు కూడా అందుతుంది.

Tags:    

Similar News