పార్ట్‌టైమ్ ప్రాఫిట్స్.. స్టూడెంట్స్ కోసం బెస్ట్ బిజినెస్ ఐడియాస్
దిశ, ఫీచర్స్ : పార్ట్-టైమ్ ఉద్యోగాల కోసం తీవ్రమైన పోటీ, సరైన ఆల్టర్నేటివ్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు చదువు.. Latest Telugu News..
దిశ, ఫీచర్స్ : పార్ట్-టైమ్ ఉద్యోగాల కోసం తీవ్రమైన పోటీ, సరైన ఆల్టర్నేటివ్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు చదువు కొనసాగిస్తూనే డబ్బు సంపాదించాలనే లక్ష్యాలను వదిలివేస్తారు. అయితే సాంకేతిక విప్లవానికి తోడు ఉద్యోగాల కోసం వెతకడం కంటే వాటిని సృష్టించడంపై పెరుగుతున్న ఏకాగ్రత కొత్త శకానికి నాంది పలికింది. ఈ రోజుల్లో పట్టణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు స్టడీస్ కంటిన్యూ చేస్తూనే లాభదాయక బిజినెస్ ఐడియాల కోసం అన్వేషిస్తున్నారు. కానీ వ్యాపారం ప్రారంభించాలంటే సరైన మైండ్‌సెట్ అవసరం. ప్రాఫిటబుల్ కాన్సెప్ట్స్, వాటి పరిమితులు, ప్రయోజనాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొంత అనుభవాన్ని పొందాల్సి ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్ ఎంతోమంది కాలేజ్ రోజుల్లోనే తమ ప్రొఫెషన్ ప్రారంభించి సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల కోసం కొన్ని లాభదాయక వ్యాపార ఆలోచనలు..
యూనిక్ ఫుడ్ సెంటర్స్
ప్రస్తుతం ఏ ప్రాంతంలో చూసినా లెక్కకు మించిన రెస్టారెంట్లు, ఫుడ్ వెండార్స్ ఉన్నారు. కానీ మెజారిటీ సెంటర్స్‌లో వైవిధ్యం, యూనిక్‌నెస్ లోపించింది. కాబట్టి మీ ఆలోచనలు క్రియేటివ్‌గా ఉంటే.. ఐస్‌క్రీమ్ దోస లేదా బటన్ ఇడ్లీ వంటి రుచులతో ఆహార ప్రియులను ఆకర్షించగలిగితే.. ఈ ఇండస్ట్రీని మీ బిజినెస్ ఆప్షన్‌గా పరిగణించవచ్చు. ఈ తరహా ఫుడ్స్ కాలేజ్ క్యాంపస్‌తో పాటు నగరాల్లోనూ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇక కస్టమర్ బేస్‌ను పెంచుకునేందుకు మంచి అభిరుచి గల యూనిక్ మార్కెటింగ్ ట్రిక్స్ ఉపయోగించవచ్చు. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ కోసం సూట్ అయ్యే స్టార్టప్ ఐడియాస్‌లో ఇదీ ఒకటి.
ఆన్‌లైన్ కోచింగ్ సర్వీస్
ఇండియాలో స్టూడెంట్స్‌కు సరిపడే టాప్-5 బిజినెస్ ఐడియాస్‌లో ఆన్‌లైన్ కోచింగ్ కూడా ఒకటి. మీ ప్రాంతంలోని విద్యార్థులకు ట్యూషన్స్ లేదా కోచింగ్ ఇస్తూ డబ్బు సంపాదించడం ఎప్పుడూ తెలివైన ఎంపికే. కొన్ని సబ్జెక్టులపై ఆసక్తి ఉండి, ప్రాథమిక అవగాహన కలిగి ఉంటే.. ఆయా ఏరియాల్లో అవసరమున్న వ్యక్తులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. మీకు కావల్సిందల్లా ల్యాప్‌టాప్ లేదా PCతో పాటు ఇంటర్నెట్ కనెక్షన్. పెద్దగా పెట్టుబడి లేకపోయినా సరే.. తగిన ఆలోచన, ప్రణాళిక ఉంటే ఈ మార్గంలో డబ్బు సంపాదించవచ్చు.
కంటెంట్ రైటింగ్
కంపెనీని, దాని ఉత్పత్తులను కస్టమర్స్‌తో కనెక్ట్ చేసే సూపర్ టూల్ 'కంటెంట్ రైటింగ్'. విజిటర్స్‌కు అవసరమైన సమాచారాన్ని అందించడంలో, బ్రాండ్ ఇమేజ్‌ను పెంపొందించడంలో కంటెంట్‌దే కీలక పాత్ర. ఈ అంశాలే కంటెంట్ రైటర్ల అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. కాబట్టి మీ ఆలోచనలు, రైటింగ్స్‌తో మ్యాజిక్ చేయగలిగే విశ్వాసముంటే 'ఫ్రీలాన్స్ రైటింగ్' సర్వీస్ మంచి ఆప్షన్. బ్లాగులు, కథనాలు, వ్యాసాలు, పత్రికా ప్రకటనలతో పాటు విభిన్న బ్రాండ్ల ప్రచారం కోసం క్రియేటివిటీని ఉపయోగించవచ్చు. మీ వర్క్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడిన ఈ బిజినెస్ ప్రారంభించడం ఉత్తమం.
ఈవెంట్ మేనేజ్మెంట్
అత్యంత ఆసక్తికరమైన వ్యాపారాల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ ఒకటి. సాధారణంగా కొందరు విద్యార్థులు క్యాంపస్ ఈవెంట్స్ ప్లానింగ్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఎక్కడ, ఎలా, ఏ విధంగా సెట్ చేస్తే అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది? ఎలాంటి గెస్ట్‌లను ఇన్వైట్ చేస్తే బాగుంటుంది..? అనే విషయంలో క్లారిటీతో ఉంటారు. అలాంటి వారికి ఈ సైడ్ బిజినెస్‌గా బెస్ట్ ఆప్షన్. అయితే క్రియేటివ్‌గా ఆలోంచిడమే కాదు ఎఫెక్టివ్ టెక్నిక్స్‌లో నాలెడ్జ్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు క్లయింట్స్‌ను మోటివేట్ చేయగల సామర్థ్యం ఈ వ్యాపారంలో మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ మోస్ట్ ప్రాఫిటబుల్‌గా మారుతుంది.
వెబ్ డెవలప్‌మెంట్ అండ్ వెబ్ డిజైన్
ప్రస్తుత ప్రపంచంలో ప్రతి కంపెనీ కూడా ఇంటర్నెట్ ప్రజెన్స్ కోరుకుంటోంది. డిజిటల్ మార్కెటింగ్ పెరగడం వల్ల గూగుల్ ఐడియాస్ అండ్ క్రైటేరియాకు కట్టుబడి ఉంటూనే ప్రజెంట్ టెక్నాలజీస్‌ను ఉపయోగించుకుని ముందుకు సాగుతున్నాయి. కస్టమర్స్‌తో బెస్ట్ కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసుకునేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ అవసరాలకు అనుగుణంగా వెబ్ డిజైన్ మరియు వెబ్ డెవలప్‌మెంట్ సేవలు అందించే వ్యాపారాన్ని సైడ్ బిజినెస్‌గా స్టార్ట్ చేస్తే.. విద్యార్థుల టాలెంట్‌కు తగిన ప్రోత్సాహం అందుతుందనడంలో సందేహం లేదు. ఈ చాన్స్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకుని.. ఎంగేజింగ్ వెబ్‌సైట్స్, అప్లికేషన్స్ క్రియేట్ చేసినట్లయితే కంపెనీలు భారీ ప్రాజెక్ట్స్ ఆఫర్ చేయొచ్చు. అదృష్టం కలిసొస్తే కొద్ది కాలంలోనే ఫేమ్ సంపాదించొచ్చు.