ఆ రెండు పార్టీలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
దిశ, వెబ్‌డెస్క్: బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే..Latest Telugu News
దిశ, వెబ్‌డెస్క్: బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 2వ తేదీ నుంచి తన యాత్రను మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ ఎస్ పార్టీ డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని బండి సంజయ్ ఎద్దెవా చేశారు. బీజేపీ పార్టీకి పెరుగుతున్న గ్రాఫ్‌ను తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. ఆగస్టు 2న తాము ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుండగా, అదే రోజు కాంగ్రెస్ ఓ సభ నిర్వహిస్తోందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని పేర్కొన్నారు.