మ్యాన్ హోల్‌లో పడిపోయిన పిల్ల ఏనుగు (వీడియో)

దిశ, వెబ్ డెస్క్: డ్రైనేజీలో పడిపోయిన ఓ పిల్ల ఏనుగును అధికారులు మ్యాన్ హోల్ ద్వారా...Baby Elephant Saved In Dramatic Rescue From Manhole In Thailand

Update: 2022-07-15 07:37 GMT

దిశ, వెబ్ డెస్క్: డ్రైనేజీలో పడిపోయిన ఓ పిల్ల ఏనుగును అధికారులు మ్యాన్ హోల్ ద్వారా సేఫ్ గా రక్షించారు. ఆ సమయంలో తల్లి ఏనుగు అడ్డుకుంది. దీంతో ఆ తల్లి ఏనుగుకు మత్తు మందు ఇచ్చి పిల్ల ఏనుగును రక్షించారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... థాయ్ లాండ్ లో ఏనుగుల గుంపు అటుగా వెళ్తుంది. ఈ క్రమంలో డ్రైనేజీలో పిల్ల ఏనుగు పడిపోతుంది. దీంతో ఆ తల్లి ఏనుగు ఆర్తనాదాలు చేస్తూ అక్కడే ఉంటుంది. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని మ్యాన్ హోల్ ద్వారా రక్షిస్తారు. ఈ క్రమంలో తల్లి ఏనుగు అడ్డుకోబోతుండగా దానికి మత్తు మందు ఇచ్చి పిల్ల ఏనుగును కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెల్ లో వైరల్ అవుతోంది. 


Similar News