సముద్ర సునామీ చూశాం.. మరి మబ్బుల సునామీ.. ఇంత భయానకమా!? (వీడియో)
ఇళ్ల వరుస పైన భారీ మేఘాలు ఏర్పడి, కదులుతూ ముందుకు వస్తుంటాయి. Unusual cloud formation like Tsunami waves.
దిశ, వెబ్‌డెస్క్ః ప్రకృతిలో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని అబ్బురంగా అనిపిస్తే మరికొన్ని భయకంపితుల్ని చేస్తుంటాయి. ఆ మధ్య సునామీ చేసిన బీభత్సాన్నీ, ఆ అలల భయానక రూపాన్ని అందరూ చూసుంటారు. కానీ, ఆకాశంలో మేఘాలు అలా సునామీ మాదిరి ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నట్లు ముందు వస్తుంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడొచ్చు. ఇది ఆశ్చర్యంతో పాటు భయాన్ని కూడా కలిగించకమానదు. Redditలో షేర్ చేసిన ఈ క్లిప్‌లో ఖాళీగా ఉన్న ఒక వీధిలోని అందమైన ఇళ్ల వరుస పైన భారీ మేఘాలు ఏర్పడి, కదులుతూ ముందుకు వస్తుంటాయి. మొదటి చూపులో భయం గొలుపుతాయి. ఇక ఈ సునామీ మేఘాలను శాస్త్రీయంగా ఆర్కస్ లేదా రోల్ క్లౌడ్ అని పిలుస్తారు. ఇంటర్నెట్లో వీడియోను చూసిన నెటిజనులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వైరల్‌గా మారిన ఈ వీడియోను మీరూ చూడండి!