Asus నుంచి 8K వీడియో రికార్డింగ్ ఫోన్..

Update: 2022-03-01 14:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్ తయారీసంస్థ ఆసుస్ కొత్త 8z ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. అనుకున్న సమాయానికంటే 9 నెలల తర్వాత భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోంది. స్మార్ట్‌ఫోన్ ధర రూ. 42,999. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్చి 7, 2022 నుంచి అందుబాటులో ఉంటుంది.

స్పెషిఫికేషన్లు..

స్మార్ట్‌ఫోన్ 5.9 "సూపర్ AMOLED (1080×2400 పిక్సెల్స్) HDR 10+ డిస్‌ప్లేను అందిస్తుంది. డిస్ప్లే 1100 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి 82.9 శాతం, రిఫ్రెష్ రేట్ 120Hz. స్మార్ట్‌ఫోన్ జెన్ UI ఆధారంగా ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో, SoC క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888, GPU అడ్రినో 660 ద్వారా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లోని ఆప్టిక్స్‌లో వెనుక భాగంలో డ్యూయల్ కెమెరాతో పాటు ముందు భాగంలో సెల్ఫీ కెమెరా ఉంటుంది. డ్యూయల్-కెమెరా సెటప్‌లో 64 MP (Sony IMX686) వైడ్-యాంగిల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. ఇది 8K@24fps వరకు వీడియోని షూట్ చేయగలదు. దీనితో పాటు 12MP (Sony IMX 363) అల్ట్రా-వైడ్ కెమెరా, ముందు భాగంలో 12 MP కెమెరాను అమర్చారు.


 



ఫోన్ 4000 mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీతో, 30W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. దీన్ని 25 నిమిషాల్లో 60 శాతం వరకు వేగంగా చార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది రివర్స్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది అబ్సిడియన్ బ్లాక్, హారిజన్ సిల్వర్ కలర్స్‌లో లభిస్తుంది. 8GB RAM128GB మెమరీని కలిగి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ 5.2, Wi-Fi, హాట్‌స్పాట్, GPS, NFC, FM రేడియో, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్ 2.0, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ డిస్‌ప్లే, యాక్సిలరోమీటర్, సామీప్య సెన్సార్, గైరోస్కోప్, లైట్ సెన్సార్, కంపాస్ మొదలైనవి ఉన్నాయి. నీరు, ధూళి నిరోధకత నుండి రక్షణ కోసం ఫోన్ IP68 రేటింగ్‌తో అమర్చబడింది.

Tags:    

Similar News