ఛాతీ పెరగడానికి ప్రయత్నిస్తున్నారా.. అయితే, ఈ ఆసనం బెటర్!
దిశ, ఫీచర్స్: బల్లపరుపు నేలమీద మ్యాట్‌పై రిలాక్స్ పొజిషన్‌లో కూర్చోవాలి. తర్వాత కుడి కాలు మోకాలిని మడిచి ముందుకు, ఎడమ కాలు నిటారుగా చాచి వెనక్కి పెట్టాలి..Latest Telugu News
దిశ, ఫీచర్స్: బల్లపరుపు నేలమీద మ్యాట్‌పై రిలాక్స్ పొజిషన్‌లో కూర్చోవాలి. తర్వాత కుడి కాలు మోకాలిని మడిచి ముందుకు, ఎడమ కాలు నిటారుగా చాచి వెనక్కి పెట్టాలి. ఇప్పుడు ఎడమ కాలు మోకాలిని మడిచి భుజాలపైనుంచి ఎడమ చేతితో పాదాన్ని పైకి లేపాలి. తర్వాత నెమ్మదిగా శరీరాన్ని వెనక్కి వంచాలి. అలా బ్యాలెన్స్ అయ్యాకా తలను పూర్తిగా వెకనవైపు వంచుతూ ఎడమకాలు పాదంపై ఆన్చాలి. ఈ భంగిమలో కుడి పాదం ఎడమ తొడకు దగ్గరగా ఉండాలి. బాడీ బ్యాలెన్స్ ఫర్‌ఫెక్ట్ సెట్ అయితే కుడి చేతితో కుడి కాలి బోటనవేలు పట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇలా కాసేపు ఆగి మళ్లీ ఎడమ కుడికాలుతో ప్రయత్నించాలి.
ప్రయోజనాలు:
* ఛాతీ, భుజాలను మరింతగా విస్తరిస్తుంది.
* ఉదర అవయవాలను ఉత్తేజపరుస్తుంది.
* మూత్ర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
* వీపు, హిప్ ఫ్లెక్సర్స్, క్వాడ్ కండరాలను సాగదీస్తుంది.
* కోర్, పెల్విక్ ఫ్లోర్‌ను బలపరుస్తుంది.