మహిళలకు గుడ్ న్యూస్.. కేసీఆర్పేరిట మరో స్కీం
రాష్ట్రంలో కేసీఆర్ పేరిట మరో స్కీం రానున్నది. త్వరలో ‘కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్’ పేరిట గర్భిణీలకు అందజేయనున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కేసీఆర్ పేరిట మరో స్కీం రానున్నది. త్వరలో 'కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్' పేరిట గర్భిణీలకు అందజేయనున్నారు. ఈ కిట్లోపోషకాహారంతో కూడిన ఆహారాన్ని అందివ్వనున్నారు. ప్రతీ ఏటా లక్షా 25 వేల మంది గర్భిణీలకు ఈ కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీని వలన గర్భిణీలు, బాలింతలలో రక్తహీనత సమస్య లోపాన్ని నివారించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకీ రక్తహీనత సమస్య పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, భద్రాచలం, కొత్తగూడెం, జయశంకర్భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్, ములుగు, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్జిల్లాల్లో ని గర్భిణీలు అత్యధికంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు స్వయంగా ప్రభుత్వ సర్వేలోనే తేలింది.
ఆరోగ్య సమస్యలు....
గర్భిణీలు సరైన పోషకాహారం అందకపోవడంతో చాలా మందిలో ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. కొన్ని సందర్భాల్లో తల్లి, బిడ్డా ఇద్దరూ హెల్త్ ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొంటున్నారు. అంతేగాక డెలివరీ సమయంలో చిక్కులు ఏర్పడుతున్నాయి. పౌష్టిహాకారం పొందకపోవడం వలన సీజేరియన్ల శాతం కూడా పెరిగింది. దీంతో ఈ కిట్ల ద్వారా గర్భిణీలకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వనున్నారు. దీని ద్వారా క్రమంగా సాధారణ ప్రసవాలు జరిగేలా సర్కార్ ప్రోత్సహించనున్నది.