అనన్య నాగళ్ల ‘పొట్టేల్’ మూవీ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

వకీల్‌సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ల(Ananya Nagalla), చంద్ర కృష్ణ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పొట్టేల్’.

Update: 2024-10-17 10:00 GMT

దిశ, సినిమా: వకీల్‌సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ల(Ananya Nagalla), చంద్ర కృష్ణ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పొట్టేల్’(pottel). అయితే ఈ చిత్రానికి సాహిత్ మోత్కూరి (Sahit Mothkuri)దర్శకత్వం వహిస్తుండగా.. నిసా ఎంటర్‌టైన్‌మెట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని నైజాం రీజియన్ లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP బ్యానర్ విడుదల చేస్తుంది.

పొట్టేల్ మూవీ అక్టోబర్ 25న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. తాజాగా, మూవీ మేకర్స్ ‘పొట్టేల్’(pottel) ట్రైలర్ అక్టోబర్ 18న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఓ సరికొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదలకు సిద్ధంగా ఉండటంతో సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.


Similar News