సూపర్ వీడియోను షేర్ చేసిన Anand Mahindra.. ఫిదా అవుతున్న నెటిజన్స్

Anand Mahindra Shares Primitive Mechanical device Video| పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన పనిలో తాను బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో సోషల్ మీడియా ద్వారా

Update: 2022-07-28 09:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: Anand Mahindra Shares Primitive Mechanical device Video| పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన పనిలో తాను బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. తన ట్విట్టర్ అకౌంట్‌లో సోషల్ మీడియా ద్వారా మోటివేషనల్ వీడియోలను పోస్టు చేస్తూ నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచేస్తారు. తాజాగా, మరో వీడియోను ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

'ఎలక్ర్టానిక్ గాడ్జెట్‌లతో నిండిపోయిన మన యుగంలో ఇదొక అద్భుతం. ఈ ప్రిమిటివ్ మెకానికల్ పరికరం కేవలం సమర్థవంతమైన యంత్రం మాత్రమే కాదు మొబైల్ శిల్పం' అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. వీడియోలో ఏముందంటే.. కట్టెతో తయారు చేసిన ఆ యంత్రం ఓ వైపు పొలాల్లోకి నీటిని తోడుతుండగా.. మరోవైపు ఆహార ధాన్యాలను దంచుకునే రోకలిగా.. ఒకేసారి రెండు పనులు చేసేలా రూపొందించారు. దాని పనితీరును చూసిన నెటిజన్లు ఫిదా అవుతూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Google Street View.. ఆరేళ్ల నిషేధం తర్వాత రీలాంచ్

Tags:    

Similar News