స్టార్ హీరో చెంప పగలగొట్టిన స్టార్ హీరోయిన్.. ఎందుకో తెలిస్తే షాక్..?

ఓ స్టార్ హీరో గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

Update: 2024-10-14 04:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ స్టార్ హీరో గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. హీరోను చెంపమీద కొట్టానని ఓ హీరోయిన్ స్వయంగా తానే చెప్పడం గమనార్హం. దానికి కారణమేంటో కూడా తెలిపింది. మరీ ఆ హీరో హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. లోకనాయకుడిగా పేరు గాంచిన ప్రముఖ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోల జాబితాలో చోటు కల్పించుకున్నాడు. ఏ రోల్‌లోనైనా అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.

'కల్కి 2898'లో పవర్ ఫుల్ విలన్‌గా నటించి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశాడు. భారీ వసూళ్లతో కొల్లగొట్టిన ఈ మూవీలో కమల్ హాసన్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇకపోతే ఈ హీరో అండ్ ఆమని విశ్వనాథ్ దర్శకత్వంలో శుభసంకల్పం అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో ఓ సన్నివేశంలో హీరోయిన్.. హీరోను చెంపమీద కొట్టాలి. జస్ట్ కొట్టినట్లు నటించాలి. కానీ ఆమని రిహాసల్స్ చేసే క్రమంలో సడన్ గా కమల్ హాసన్ చెంపపై గట్టిగా కొట్టిందట. దీంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారట. తర్వాత హీరో వచ్చి.. కొట్టినట్లు నటించాలి కానీ ఇలా గట్టిగా కొట్టడం కాదని ఫన్నీగా చెప్పాడట. ఈ విషయాన్ని ఆమని ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ఆమని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Similar News