Upendra's UI: అల్లు అరవింద్‌కే ఉపేంద్ర సినిమా హక్కులు.. రిలీజ్ ఎప్పుడంటే?

కన్నడ సూపర్ స్టార్ (Kannada Superstar) ఉపేంద్ర (Upendra) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యూఐ’ (UI).

Update: 2024-11-20 13:11 GMT
Upendras UI: అల్లు అరవింద్‌కే ఉపేంద్ర సినిమా హక్కులు.. రిలీజ్ ఎప్పుడంటే?
  • whatsapp icon

దిశ, సినిమా: కన్నడ సూపర్ స్టార్ (Kannada Superstar) ఉపేంద్ర (Upendra) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యూఐ’ (UI). లహరి ఫిల్మ్స్ (Lahari Films), జి మనోహరన్ (G Manoharan) & వీనస్ ఎంటర్టైనర్స్ (Venus Entertainers), కెపీ శ్రీకాంత్ (KP Srikanth) నిర్మాతలుగా, నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. టీజర్ (teaser)కి అద్భుతమైన స్పందన లభించింది.

ఇక ఉపేంద్ర కెరీర్‌లోనే హై బడ్జెట్ (high budget) అండ్ క్రేజీ ప్రాజెక్ట్ (Crazy Project)గా తెరకెక్కుతున్న ‘యూఐ’ చిత్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రైట్స్‌ను గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ (Geeta Film Distributors) అల్లు అరవింద్ (Allu Arvind) దక్కించుకున్నారు. అంతే కాకుండా.. ఈ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు రిలీజ్ డేట్ ప్రకటించారు. కాగా.. ఇందులో రీష్మా నానయ్య, నిధి సుబ్బయ్య, మురళీ శర్మ & పి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తుండగా.. కాంతార ఫేమ్ అజనీష్ బి లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Tags:    

Similar News