Rishabh Shetty: మీ అందరి ప్రేమ, మద్దతుతోనే ఇంత మంచి విజయం సాధించా.. రిషబ్ శెట్టి ట్వీట్

70వ జాతీయ చలనచిత్ర అవార్డు వేడుక ఢిల్లీలోని ఘనంగా జరిగింది. ఈ అవార్డుకు వివిధ భాషల్లోని నటీనటులు ఎంపికయ్యారు.

Update: 2024-10-09 08:13 GMT

దిశ, సినిమా: 70వ జాతీయ చలనచిత్ర అవార్డు వేడుక ఢిల్లీలోని ఘనంగా జరిగింది. ఈ అవార్డుకు వివిధ భాషల్లోని నటీనటులు ఎంపికయ్యారు. అయితే విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందించారు. ఇందులో ‘కాంతార’ సినిమాకు గాను రిషబ్ శెట్టి కూడా ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఈ విషయంపై ఆయన ‘X’ వేదికగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఒక విజన్‌గా మొదలైనది నా ప్రయాణం మీ ప్రేమ, అభిరుచి నమ్మకంతో నిండి ఉంది.

అందరి ప్రేమ, మద్దతుతో ఇంత మంచి విజయం సాధించాను. ఈ రోజు జాతీయ అవార్డుతో గర్వంగా నిలబడితే నా హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగిపోతుంది. ఈ గౌరవం మాది మాత్రమే కాదు- మీ అందరిది. మీ మద్దతు, అడుగడుగునా మమ్మల్ని నడిపించిన మీ ప్రేమకు ప్రతిబింబమే ఈ అవార్డు. మా ఈ కలను నిజం చేసినందుకు ధన్యవాదాలు. కాంతారావు కథ మాది అంతే విజయం మాత్రం మీ వల్లే సాధ్యమైంది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాం’’ అని రాసుకొచ్చారు.

అలాగే అవార్డుతో తీసుకున్న పిక్స్‌ను కూడా షేర్ చేశారు. కాగా, రిషబ్ శెట్టి ‘కాంతార’ మూవీలో హీరోగా నటించడంతో పాటు డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు పలు అవార్డులు కూడా దక్కించుకుంది. ప్రజెంట్ దీనికి ప్రీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News