ఫ్లైట్‌లో లెస్బియన్ జంట ఇలా ప్రపోజ్ చేసుకున్నారు..! (వీడియో)
'ప్రేమ..' ఏ భాషలోనైనా చాలా మధురంగా వినిపించే శబ్ధం. Viral video of the flight attendant proposing to her girlfriend.
దిశ, వెబ్‌డెస్క్ః 'ప్రేమ..' ఏ భాషలోనైనా చాలా మధురంగా వినిపించే శబ్ధం. ఎలాంటి అడ్డంకులు, అవధులు లేని ఒకే ఒక్క భావన ఇది. అయితే, ఈ భావనకు బలం చేకూరుస్తూ, అలాస్కా ఎయిర్‌లైన్స్ ప్రైడ్-థీమ్ విమానంలో జరిగిన ఓ మిడ్-ఫ్లైట్ లవ్ ప్రపోజల్ ఇంటర్నెట్లో అందరి హృదయాలను గెలుచుకుంది. మనసును తాకే ఈ ఘటనలో ఒక ఫ్లైట్ అటెండెంట్ తన పైలట్ గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రేమను ప్రపోజ్ చేయడాన్ని ఈ అద్భుతమైన వీడియో చూపిస్తుంది. ఈ వీడియోను ఎయిర్‌లైన్స్ తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. "అలాస్కా ఫ్లైట్ అటెండెంట్ వెరోనికా తన ప్రియురాలు (కొత్తగా నియమించబడిన పైలట్!) అలెజాండ్రాతో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో నుండి లాస్ ఏంజిల్స్‌కు ప్రత్యేక ప్రైడ్ డిలైట్ ఫ్లైట్‌లో ప్రయాణించింది. అయితే, విమానంలో సగం ప్రయాణం తర్వాత వెరోనికా అలెజాండ్రాకు ప్రపోజ్ చేసింది. తన భాగస్వామి కోసం స్పానిష్ నేర్చుకుంటున్న ఆమె, ప్రపోజల్ కూడా స్పానిష్‌లో చేస్తుంది.
వీడియోలో మొదటిగా వెరోనికా తాను అలెజాండ్రాను ఎలా కలిసిందో తెలియజేస్తుంది. ఆమె తన భాగస్వామితో వచ్చీరాని స్పానిష్‌లో మాట్లాడుతుంది. అయితే, ఎంతో అందమైన ఈ కథలో ఒక ట్విస్ట్ కూడా ఉంది. అలెజాండ్రా కూడా అదే రోజు వెరోనికాకు ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ షేర్ చేసిన బ్లాగ్ నివేదించడం విశేషం. అయితే, వీళ్లిద్దరూ విమానం దిగిన తర్వాత జంటగా సెలబ్రేట్ చేసుకున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా అలస్కా ఎయిర్‌లైన్స్‌తో అలెజాండ్రా మాట్లాడుతూ, "ఈ అనుభం అద్భుతంగా ఉంది, నేను ఈరోజును ఎప్పటికీ మరిచిపోలేను, ఇది నాకు ఎంతో ఇష్టమైన రోజుగా గుర్తుండిపోతుంది" అని చెప్పింది. వీళ్లిద్దరూ ప్రయాణించిన ఎయిర్‌లైన్స్ 'ఫ్లై విత్ ప్రైడ్' విమానం LGBTQ+ కమ్యూనిటీకి తమ మద్దతును తెలియజేయడానికి ఎయిర్‌లైన్స్ చేసిన ప్రత్యేక ప్రయత్నం. ఇందులో, ఎయిర్‌బస్ A320 విమానం, ఐకానిక్ రెయిన్బో రంగులతో అలంకరించారు.