‘స్వయంభూ’ సెట్‌లో ఆయుధపూజ.. వైరల్‌గా మారిన వీడియో

యంగ్ హీరో నిఖిల్ (Nikhil) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘స్వయంభూ’ (Swayambhu) ఒకటి.

Update: 2024-10-11 10:11 GMT

దిశ, సినిమా: యంగ్ హీరో నిఖిల్ (Nikhil) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘స్వయంభూ’ (Swayambhu) ఒకటి. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari) దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘స్వయంభూ’ (Swayambhu)ని ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా షూటింగ్ సెట్ నుంచి ఫైరింగ్ వీడియోను షేర్ చేశారు చిత్ర బృందం. ప్రజెంట్ దేవీ నవరాత్రులను పురస్కరించుకొని తాజాగా ‘స్వయంభూ’ (Swayambhu) సెట్‌లో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ మేరకు ఈ మూవీలో వినియోగిస్తున్న ఆయుధాలన్నింటికీ పూజ చేశారు. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో ప్రజెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ‘స్వయంభూ’లో నభా నటేష్ హీరోయిన్ (Nabha Natesh) గా నటిస్తుంది.


Full View



Similar News