Yoga: శుప్త వజ్రాసనం ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?
దిశ, వెబ్ డెస్క్: శుప్త వజ్రాసనం ఎలా వేయాలి అంటే?. ముందుగా వజ్రాసనంలో కూర్చొని..About Yoga
దిశ, వెబ్ డెస్క్: శుప్త వజ్రాసనం ఎలా వేయాలి అంటే?. ముందుగా వజ్రాసనంలో కూర్చొని, మోకాళ్లను కొంచెం దూరంగా జరపాలి. పాదాల వేళ్లు దగ్గరగా వచ్చి మడమలు దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి. మోచేతులు నెమ్మదిగా శరీరానికి పక్కగా ఆన్చి, బాడీ మొత్తాన్ని వెనక్కి తీసుకెళ్లి తలను నేలకు ఆన్చాలి. చేతులు రెండూ నెమ్మదిగా కాళ్ల మీద పెట్టాలి. ఇదే స్థితిలో ఉండగలిగినంత సమయం ఉండి నెమ్మదిగా చేతి ఆసరాతో యథాస్థితికి రావాలి.
ఉపయోగాలు:
* ఊపిరితిత్తులు, పక్కటెముకలకు శక్తినిస్తుంది.
* ఆస్తమా బాధితులకు మేలు కలుగుతుంది.
* కాలి కండరాలను బలోపేతం చేస్తుంది.
* థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరుస్తుంది.