అవును ఐశ్వర్యతో వైరుధ్యాలున్నాయి.. అభిషేక్ బచ్చన్
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్యా రాయ్‌తో వైరుధ్యాలున్నట్లు అంగీకరించాడు..Latest Telugu News
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్యా రాయ్‌తో వైరుధ్యాలున్నట్లు అంగీకరించాడు. 2007లో వివాహం చేసుకున్న ఈ జంట 'కాఫీ విత్ కరణ్' సీజన్ 3లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా కొద్ది గ్యాప్ తర్వాత మళ్లీ మొదలైన కరణ్ షో ప్రస్తుతం 7వ సీజన్‌తో ఎంటర్‌టైన్ చేయబోతోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి స్టార్ నటులు పాల్గొని సందడి చేయనున్నారు.
ఈ క్రమంలోనే సెలబ్రిటీ కపుల్స్ మధ్య విభేదాల డిస్కషన్‌లో భాగంగా అభిషేక్, ఐశ్వర్య ఇష్యూను గుర్తుచేసిన కరణ్.. అభిషేక్ అభిప్రాయాలను మరోసారి తెరపైకి తీసుకొస్తూ ఇలా అన్నాడని చెప్పాడు. 'నిజంగా మా గురించి చెప్పాలంటే బయటకు బాగానే కనిపించినా.. వ్యక్తిగత విషయాల్లో కొంచెం వైరుధ్యం ఉంది. ఆమె మనసు దయతో కూడినప్పటికీ ఒక మహిళగా కఠినంగానే వ్యవహరిస్తుంది. కానీ ఆమె నాకు గొప్ప స్నేహితురాలు. నేను నా ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నప్పుడు ఆమె కూడా తన స్నేహితులతో కలిసి కొంత సమయాన్ని ఆనందించడం నాకు ఇష్టమే' అన్న అభిషేక్ మాటలను గుర్తు చేసుకున్న కరణ్.. దీన్ని కొంతమంది తప్పుగా కూడా అర్థం చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.