హర్భజన్ సింగ్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి!
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలన ప్రారంభించింది. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. షహీద్ భగత్ సింగ్ స్వగ్రామం ఖట్కర్ కలాన్‌లో.. వేలాది మంది ప్రజల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పంజాబీలను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయంగా పట్టు సారించేందుకు సీఎం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తరుఫున ప్రముఖ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను రాజ్యసభకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా జలంధర్‌లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. భగవంత్ మాన్ హర్భజన్ సింగ్‌కు స్పోర్ట్స్ యూనివర్శిటీ కూడా ఆయన అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలావుంటే, పంజాబ్ నుంచి ఎన్నికైన ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. ఈ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అవకాశం ఇస్తే.. రాజ్యసభలో వెళ్లేందుకు హర్భజన్ సింగ్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.