కంగారూల బాక్సింగ్ మ్యాచ్.. చివరికి అదే గెలిచింది! (వీడియో)
ఆశ్చర్యంగా అనిపించే వీటి ఫైటింగ్ వెనుక ఆసక్తికర సైన్స్ చాలా ఉంది. Kangaroos' Hand-To-Hand Combat Wins Internet.
దిశ, వెబ్‌డెస్క్ః పెంపుడు జంతులతో ఆటలు సరదాగా ఉంటాయి. కానీ, కోడి పందాల్లా కొన్ని మాత్రం చాలా సీరియస్‌గా ఉంటాయని అందరికీ తెలుసు. అయితే, కంగారూల ఫైట్ మాత్రం ఈ రెండూ కలిసి ఉన్నట్లు ఉంటుంది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో జూలోని ఎన్‌క్లోజర్‌లో రెండు కంగారూలు ఒకదానితో ఒకటి పోరాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాక్సింగ్‌లా కనిపించే ఈ యుద్ధాన్ని జూ ప్రెసిడెంట్, CEO అయిన టిమ్ మారో చిత్రీకరించి, దానికి "మార్సుపియల్ మార్షల్ ఆర్ట్స్" అని పేరుపెట్టాడు. వాస్తవానికి మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)లో దీనికి ప్రసిద్ధ పోరాట క్రీడగా గుర్తింపు ఉంది. 31 సెకన్ల ఈ వీడియోలో రెండు కంగారూలు పరస్పరం బాక్సింగ్ చేసుకుంటాయి. ఈ పోరాటంలో రెండిటకీ దెబ్బలు తగిలనట్లు చూడొచ్చు. అచ్చం బాక్సింగ్ క్రీడలా ఉండే ఈ సీన్‌లో వాటి చేతికి గ్లౌజులు ఉండవంతే! ఇద్దరు "ఫైటర్లు" ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకోవడం, శరీరాలను తోకపై బ్యాలెన్స్ చేసుకుంటూ, ముఖాలను దగ్గరగా అడ్డంపెట్టుకోవడం కనిపిస్తుంది. వీడియోలో చివరికి ఒక కంగారు పారిపోగా, మరొకటి విజయగర్వంతో కనిపిస్తుంది.
ఇక, సుత్రాలియా అధికారిక చిహ్నంలో కనిపించే కంగారూలు ఇలాంటి పోరాటాలను సీరియస్‌గా తీసుకోవడంలో పేరుగాంచినవి. ఇలా బాక్సింగ్ చేసుకునే కంగారూల వీడియోలు ఇంటర్నెట్‌లో కొత్తేమీ కాదు. సహజంగానే వీటి తోకలు చాలా బలమైన కండరాలు కలిగి ఉంటాయి. వాటి మొత్తం బరువును తోకపై ఉంచగల పటుత్వం వాటి సొంతం. ముందరి కాళ్లతో పిడిగుద్దులు కురిపిస్తూ వెనుక కాళ్లను బ్యాలన్స్ చేసుకుంటాయి. ముసలి కంగారూలను చూసి యంగ్ కంగారూలు ఈ ఫైటింగ్ నేర్చుకుంటాయి. ఆశ్చర్యంగా అనిపించే వీటి ఫైటింగ్ వెనుక ఆసక్తికర సైన్స్ చాలా ఉండటం విశేషం.