బొంరాస్ పేట్లో అదృశ్యం.. మాదారం గ్రామంలో మృతదేహం
దిశ, పరిగి: తాగుడుకు బానిసై బొంరాస్పేట్వాసి పరిగి మండలం - A man has died under suspicious circumstances in Parigi
దిశ, పరిగి: తాగుడుకు బానిసై బొంరాస్పేట్వాసి పరిగి మండలం మాదారం గ్రామంలో మృతి చెందాడు. పరిగి ఎస్ఐ పి.విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం పెద్ద మాదారం గ్రామంలో ఆదివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం ఉందని స్థానికుడు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ విఠల్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం బోర్లాపడి నలుపు, నీలిరంగులోకి మారి మృతదేహాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో గాలించగా ఓ పర్సు లభించి అందులో ఫోటో, ఆధార్ కార్డు దొరికింది. ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు బొంరాస్ పేట్ గ్రామానికి చెందిన మంగలి వెంకటయ్య(52)గా గుర్తించారు. కుటుంబీకులకు సమాచారం అందించగా చనిపోయింది మంగళి వెంకటయ్య మా నాన్ననే అని మంగళి మల్లేష్మృతదేహాన్ని గుర్తించి చెప్పాడు.
కాగా మంగలి వెంకటయ్య కొంతకాలం క్రితం తన భార్యను చంపి జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చాడని తెలిపాడు. అప్పటి నుంచి తాగుడుకు మరింత బానిసై ఇంట్లో ఉండకుండా 15 రోజుల నుంచి కనిపించకుండా వెళ్లినట్లు తెలిపారు. బొంరాస్‌పేట్ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నామని ఇలా మృతి చెందడం బాధకరమని రోధించాడు. మృతుడి కుమారుడు మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.