Viral Video: రెస్టారెంట్‌ను మోసం చేసిన కంత్రీ చేప... వీడియో వైరల్

దిశ, వెబ్ డెస్క్: ప్లేటులో సలాడ్ తోపాటు సర్వ్ చేసిన చేప చాప్ స్టిక్స్ తినడానికి ట్రై చేస్తోన్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Update: 2022-03-31 13:34 GMT

దిశ, వెబ్ డెస్క్: ఫుల్లుగా ఆకలితో ఉన్నాం. మంచి రెస్టారెంట్ కి వెళ్లి ఘుమఘుమలాడే ఫిష్ కర్రీ ఆర్డర్ ఇచ్చేశాం. ఆర్డర్ ఎప్పుడు రెడీ అవుతుందబ్బా? వెయిటర్ ఎప్పుడెప్పుడు తెచ్చి సర్వ్ చేస్తాడా..? ప్లేట్ లోకి రాగానే ఓ పట్టు పట్టాల్సిందే అనుకుంటూ ఎదురు చూస్తుండగా... ఆర్డర్ రానే వచ్చేసింది. వెయిటర్ ప్లేటులోకి డిష్ సర్వ్ చేసేశాడు. ఇక లాగించేద్దాం అని ఆత్రంగా నోరు తెరిచి ప్లేటులోకి చూడాగానే... నోరు తెరిచి మనవైపు అమాయకంగా చూస్తున్న చేపను చూస్తే..? ఒక్కసారి ఊహించుకోండి., ఆకలి సంగతి మర్చిపోయి షాక్ నుండి తేరుకోడానికి ఐదు నిమిషాలైనా పడుతుంది కదా.. సరిగ్గా ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఒక ప్లేట్ లో సలాడ్ తోపాటు రెండు చేపలను ఉంచారు. వాటిలో ఒకటి మామూలు చేప కాదు ప్లేట్ లో దర్జాగా, ధైర్యంగా తిష్ట వేసింది. కస్టమర్ చాప్ స్టిక్స్ దాని నోటి దగ్గర పెడితే తినేయడానికి ట్రై చేస్తోందా కంత్రీ చేప. ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. రెస్టారెంట్ ని మోసం చేసిన చేప అంటూ ఒకరు అంటుంటే.. అసలు అది పచ్చిగా తినడానికా? లేదా కుక్ చేసి తింటారా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇంకొందరు. మరికొందరేమో అసలు ఎవరైనా దీన్ని తింటారా అంటూ అసహ్యించుకుంటున్నారు. ఎవరు ఎలా స్పందించినా లక్షల్లో వ్యూస్ తెచ్చుకుని ఆ చేప సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది. (వీడియో కింద ఉంది చూడవచ్చు)

Full View

Tags:    

Similar News