Allu Arjun: 1600 కి.మీ సైకిల్‌ తొక్కుతూ వచ్చిన అభిమాని.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే? (వీడియో)

హీరోలపై ఉన్న ప్రేమతో అభిమానులు ఒక్కోసారి చచ్చిపోవడానికి కూడా వెనకాడరు అనడంలో అతిశయోక్తి లేదు.

Update: 2024-10-16 11:31 GMT

దిశ, సినిమా: హీరోలపై ఉన్న ప్రేమతో అభిమానులు ఒక్కోసారి చచ్చిపోవడానికి కూడా వెనకాడరు అనడంలో అతిశయోక్తి లేదు. కొంతమంది ప్రేమను చూస్తే వింతగానూ అనిపిస్తుంటుంది. అయితే కొన్నిసార్లు అభిమాన హీరోల కోసం వందల కిలోమీటర్లు నడిచి వచ్చిన సంఘటనలు కూడా చూశాం. అలాగే రాష్ట్రాలు దాటి మరీ ఇండియాకు వచ్చి కొందరు స్టార్ హీరోల సినిమాలు చూసి తిరిగి వెళ్తుంటారు. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో అందరినీ ఫిదా చేస్తుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమాని ఏకంగా ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ నుంచి 1600కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ హైదరాబాద్‌కు వచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయం ఐకాన్ స్టార్‌కు తెలియడంతో వెంటనే అతన్ని కలిసి పూల కుండిని బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వచ్చానని అభిమాని చెప్పడంతో షాక్ అయ్యారు.

తిరిగి సైకిల్ మీద వెల్లొద్దని చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తానని చెప్పడంతో పాటు కొంత డబ్బును కూడా ఇవ్వమని అల్లు అర్జున్ మ్యానేజర్‌కు చెప్పారు. అలాగే ‘పుష్ప-2’ ప్రమోషన్స్ కోసం ఉత్తరప్రదేశ్ వస్తే అతన్ని తప్పకుండా కలుస్తానని మాట ఇచ్చారు. అయితే అభిమాని మాత్రం ఆయన ను చూసిన ఆనందంతో కళ్లల్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజెంట్ ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. మరీ ఇంత పిచ్చి ఏంట్రా నాయనా అని అంటున్నారు.

Tags:    

Similar News