ఆఫీసులో జోకులేయడం 'అన్ ప్రొఫెషనల్' : లింక్డ్‌ఇన్ రిపోర్ట్!
దిశ, ఫీచర్స్ : భారతదేశంలోని దాదాపు 10 మంది ప్రొఫెషనల్ వర్కర్స్‌లో తొమ్మిది మంది (87 శాతం) ఆఫీసులో భావోద్వేగాలను పంచుకోవడం వల్ల ప్రొడక్టివిటీ పెంచబడుతుందని లింక్డ్ఇన్ తాజా నివేదిక వెల్లడించింది..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : భారతదేశంలోని దాదాపు 10 మంది ప్రొఫెషనల్ వర్కర్స్‌లో తొమ్మిది మంది (87 శాతం) ఆఫీసులో భావోద్వేగాలను పంచుకోవడం వల్ల ప్రొడక్టివిటీ పెంచబడుతుందని లింక్డ్ఇన్ తాజా నివేదిక వెల్లడించింది. ఆ రిపోర్ట్‌లోని మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మీకోసం మహమ్మారి తర్వాత భారతదేశంలోని నలుగురు ప్రొఫెషనల్స్‌లో ముగ్గురు (76 శాతం) తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడాన్ని మరింత కంఫర్ట్‌బుల్‌గా భావిస్తున్నారని పరిశోధన వెల్లడించింది. ఈ మార్పు లింక్డ్‌ఇన్‌లో కూడా ప్రతిబింబిస్తోందని, ఇలాంటి సంభాషణల్లో 28 శాతం పెరుగుదల కనిపించినట్లు పేర్కొంది.
దాదాపు మూడింట రెండు వంతుల (63 శాతం) మంది తమ యజమాని ముందు ఏడ్చినట్లు అంగీకరించగా, వీరిలో మూడో వంతు (32 శాతం) మంది ఒకటి కంటే ఎక్కువ సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్నట్లు పేర్కొంది. అయితే భారతదేశంలోని 10 మంది ప్రొఫెషనల్స్‌లో ఏడుగురు (70 శాతం) పనిలో భావాలను పంచుకోవడంలో 'స్టి్గ్మా' ఉందని నమ్ముతున్నారు. దీని కారణంగా, భారతదేశంలోని నాల్గో వంతు మంది ప్రొఫెషనల్స్ ఇప్పటికీ బలహీనంగా (27 శాతం), అన్‌ప్రొఫెషనల్స్‌గా (25 శాతం), బీయింగ్ జడ్జ్‌డ్(25 శాతం) వంటి భయాలతో ఎవరితో మాట్లాడకుండా ఆందోళన చెందుతున్నారు.
ఆడోళ్లపైనే భారం:
మహిళలు ఎక్కువ భారాన్ని భరిస్తున్నట్లుగా నివేదిక పేర్కొనగా ఈ మేరకు భారతదేశంలోని దాదాపు ఐదుగురు (79 శాతం) ప్రొఫెషనల్స్ తమ కొలిగ్స్‌తో భావోద్వేగాలను పంచుకున్నప్పుడు పురుషులతో పోల్చితే మహిళలు ఎక్కువగా 'జడ్జ్' చేయబడతారని అంగీకరిస్తున్నారు. జెన్-z, మిలీనియల్స్ తమను తాము వ్యక్తీకరించడంలో, పని చేసేందుకు గతంలో కంటే మరింత కంఫర్ట్‌బుల్‌గా ఉండటంలో ముందున్నారు. వారితో పోల్చి చూస్తే, కేవలం 20 శాతం మంది బూమర్స్ (58-60 ఏళ్ల వయస్సు గలవారు) మాత్రమే పనిలో తమను తాము వ్యక్తీకరించుకోవడంలో సౌకర్యంగా ఉన్నారని నివేదిక పేర్కొంది.
క్రాకింగ్ జోక్స్ :
భారతదేశంలోని మూడొంతుల మంది ప్రొఫెషనల్స్ పనిలో 'జోకులు' వేయడాన్ని ఆఫీస్ కల్చర్‌కు మంచిదని అంగీకరిస్తుంటే, సగం కంటే ఎక్కువ మంది (56 శాతం) దాన్ని 'అన్ ప్రొఫెషనల్'గా భావిస్తారు. ఇలాంటి మిశ్రమ భావాలు ఉన్నప్పటికీ, భారతదేశంలోని 10 మంది ప్రొఫెషనల్స్‌లో తొమ్మిది మంది పనిలో హాస్యం చాలా తక్కువగా ఉపయోగించబడుతుందని, తక్కువ అంచనా వేయబడిన భావోద్వేగమని అంగీకరిస్తున్నారు. వాస్తవానికి, ఐదుగురు ప్రొఫెషనల్స్‌లో ముగ్గురు కంటే ఎక్కువ మంది సాధారణంగా కార్యాలయంలో ఎక్కువ హాస్యాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నారు. మొత్తం మీద, దక్షిణ భారతదేశంలోని ప్రొఫెషనల్స్ దేశంలో ఎక్కువ జోకులు పేల్చుతున్నారని నివేదిక పేర్కొంది