జీహెచ్ఎంసీ అధికారులపై మాదాపూర్ డీసీపీకి 11 ఏళ్ల బాలిక ఫిర్యాదు

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని రహదారుల మరమ్మతుల గూర్చి..

Update: 2022-03-12 13:41 GMT

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని రహదారుల మరమ్మతుల గూర్చి పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులపై కేసు నమోదు చేయాలని 11 ఏళ్ల బాలిక శనివారం మాదాపూర్ డీసీపీ శిల్పవల్లికి ఫిర్యాదు చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ తోపాటు సర్కిల్-20లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పైనా కేసు నమోదు చేయాలని డీసీపీ శిల్పవల్లికి శాహెర్ కౌర్ అనే బాలిక ఫిర్యాదు చేసింది. గతంలో రోడ్ల మరమ్మతులపై అధికారులకు పలు సూచనలు చేసినట్లు పేర్కొంది. 4 నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. 11 ఏళ్ల బాలిక జీహెచ్ఎంసీ అధికారుల మీద ఫిర్యాదు చేయడం సర్వత్రా ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News