దిశ, వెబ్ డెస్క్: చాలామంది ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగుతారు. అయితే, ఈ విషయంలో చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే, మనం పగలంతా అలసి సొలసి సాయంత్రం ఇల్లు చేరి సేద తీరి నిద్రిస్తాం. ఆ తర్వాత మనతోపాటు మన శరీరంలోన్ని అవయవాలన్నీ మనతోపాటు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఉదయం మనం లేస్తాం కానీ, శరీరంలోని అవయవాలన్నీ మగతగానే ఉంటాయి. వాటిని ఉత్తేజపరచాలంటే ఘనపదార్థాలతో ప్రారంభించకూడదు. గోరు వెచ్చని నీటితో మన దిన చర్య ప్రారంభిస్తే శరీరంలోని అవయవాలన్నీ కూడా మనతోపాటు ఉత్సాహంగా పని చేస్తాయి. అంతేకాదు.. ఉదయం లేవగానే నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ఎంతో మేలు జరుగుతుంది.