మానుకోటలో బాంబుల మోత.. బెంబేలెత్తుతున్న స్థానికులు
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో పలు క్వారీలల్లో బాంబుల మోత దద్దరిలిల్లుంతుంది.
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో పలు క్వారీలల్లో బాంబుల మోత దద్దరిలిల్లుంతుంది. అనుమతులు లేకున్నా ఇష్టానుసారంగా జిలిటేన్ స్టిక్స్‌తో పాటు ఇతర ఎక్స్ ప్లోజింగ్ పదార్థాలువాడుతున్నారు. అనుమతులు గోరంత తీసుకుని కొండలను మాత్రం పిండి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ యంత్రాలు, బాంబులతో బండలను బద్దలు కొట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయలుఅక్రమంగా సంపాదిస్తున్నారన్నడంలో అతియోశక్తి లేదు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంకు కూత వేటు దూరంలో ఉన్న బయ్యారం రోడ్డు వైపు ఉన్న క్వారీలో బాంబులమోత మోగుతోంది. జిల్లా కేంద్రంలో ఉన్న క్వారీలతో పాటు క్రషర్‌లలో సైతం భారీ విస్ఫోటనం చేస్తున్నారు. మహబూబాబాద్, కేసముద్రం, నెల్లికుదుర్, గూడూరు మండలాల్లో సైతం అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. క్వారీ నిర్వాహకులు పెద్దపెద్ద బండరాళ్లను, భారీ గుట్టలను తొలచే క్రమంలో భారీగా బాంబు బ్లాస్టింగ్‌లకు పాల్పడుతున్నారని సమీప గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో పశువుల కాపర్లు, సమీపంలోని రైతులు భయంతో ఇంటి బాట పట్టాల్సి వస్తుంది. ఎప్పుడు బాంబులు పేలుతాయో అని భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటి బాట పట్టాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాంబు బ్లాస్టింగ్ వల్ల సమీపంలోని పొలాల్లో దుమ్ము భారీగా పేరుకుపోతుందని, దాని కారణంగా పంట పొలాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖ అనుమతులను తప్పనిసరిగా పొందాల్సినప్పటికీ ,కొంతమంది సామర్థ్యానికి మించి బాంబులను వినియోగిస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో ఇండ్లు దద్దరిల్లడంతో పాటు, రాళ్లు ఎగిరిపడుతున్నాయి. దుమ్ము, ధూళీ వెదజల్లుతుండగా పర్యావరణం సమతుల్యత దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయని పర్యావరణ ప్రేమికుల ఆందోళన చెందుతున్నారు. మైనింగ్ శాఖ ఇచ్చిన అనుమతులను, లీజ్‌లను మించిన విస్తీర్ణంలో త్వవకాలు చేస్తున్న ట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి రైతులకు జరుగుతున్న ఇబ్బందులను తొలిగించి, భారీ అక్రమ పేలుళ్ళు ను నిలువరించి , పర్యావరణంను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
అనుమతులు నో..
జిల్లాలో పలు క్వారీలకు మైన్స్ సేఫ్టీ , లేబర్ సేఫ్టీ అనుమతులు లేవు. ఏ ఒక్క క్వారీలో అంబులెన్స్ అందుబాటులో లేదు. ప్రమాదం జరిగినప్పుడు లేబర్ లు మృతి చెందుతున్నారు. సర్ధిఫీకేట్ కలిగిన బాస్టర్ మాత్రమే బ్లాస్టింగ్ చేయాలని కానీ ఒక్క బాస్టర్ కూడా లేకుండా అన్ని క్వారీల్లో బ్లాస్టింగ్ చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ కూడా అనుమతులు ఉన్న చోట కాకుండా మరో చోట డంపింగ్ చేస్తున్నారు. బాంబులు ఎప్పుడు పేల్చుతారో తెలియక పొలాల దగ్గరికి పోవాలంటే భయంగా ఉంది . ఎక్కడ మీద పడుతున్నాయో అనే ఆందోళన చెందాల్సిన దుస్థితి . రాళ్లు తలకు తాకకుండా హెల్మెట్ పెట్టుకొని పొలాల వద్దకు పోవాల్సి వస్తుంది. అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో ఇటువైపు పొలాల వద్దకు రైతులు వెళ్ళాలంటే వణుకు పుడుతుంది.
ధరం సౌత్ బాలాజీ, గాంధీ పురం,మానుకోట
సమాచారం ఇవ్వడం లేదు..
జిల్లాలో ఉన్న క్వారీల లీజ్ పై సమాచార హక్కు చట్ట ప్రకారం వివరాలు అడిగితే గడువు దాటినప్పటికి సమాచారం ఇవ్వడం లేదు. లీజ్ పరిధి దాటి తవ్వకాలు చేస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారు. కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో పంచాయతీ రాజ్ మెటల్ రోడ్డును ఓ క్వారీ ఆక్రమించారని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. బ్లాస్టింగ్ సమయంలో భూకంపం వచ్చినట్లు అనిపిస్తుంది. చెరువులు కలుషితమవుతున్నాయి.
భరత్,కేసముద్రం