ఈ నెల 4న వైఎస్ షర్మిల నామినేషన్.. ఎట్టకేలకు ఖరారైన నియోజకవర్గం

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్కడినుంచి పోటీ చేస్తారనే

Update: 2023-10-29 12:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్కడినుంచి పోటీ చేస్తారనే విషయంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. గతంలో చెప్పినట్లుగానే ఆమె పాలేరు నుంచే బరిలోకి దిగనున్నారు. అంతేకాదు నామినేషన్ వేయడానికి ముహూర్తం కూడా ఖరారు అయింది. నవంబర్ 4న షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 1 నుంచి నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.

వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తరపున పాలేరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ విడుదల చేసిన రెండో విడత జాబితాలో ఆయనకు సీటు ఫిక్స్ చేశారు. ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పొంగులేటికి గుర్తింపు ఉంది. దీంతో పాలేరులో పొంగులేటి వర్సెస్ షర్మిల పోరు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పొంగులేటి పాలేరు నుంచి పోటీ చేస్తుండటంతో షర్మిల వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది.

కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిపై షర్మిల పోటీ చేస్తారనే వార్తలు కూడా బలంగా వినిపించాయి. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీీపీ విలీనం చేయాలని షర్మిల ప్రయత్నాలు చేశారు. డీకే శివకుమార్ దీనికి మధ్యవర్తిత్వం వహించారు. కానీ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి విలీనాన్ని అడ్డుకున్నారనే టాక్ ఉంది. తొలి నుంచి విలీనాన్ని వ్యతిరేకిస్తున్న రేవంత్.. ఏఐసీసీ అగ్రనేతలను ఒప్పించారు.


Similar News