రక్షకుడు కాదు.. రైతుల పాలిట రాక్షసుడు కేసీఆర్: YS షర్మిల తీవ్ర విమర్శలు

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని దొంగ మాటలు చెప్పడానికి దొరకు సిగ్గుండాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సీఎం కేసీఆర్‌ను విమర్శించారు.

Update: 2023-09-04 13:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని దొంగ మాటలు చెప్పడానికి దొరకు సిగ్గుండాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. రైతు ప్రభుత్వమే అయితే.. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగనట్లు? అని ఇవాళ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు భరోసా పాలనైతే రోజుకు నలుగురు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నట్లు అని నిలదీశారు. అప్పుల్లో 5వ స్థానం, ఆత్మహత్యల్లో 4వ స్థానం, ఆదాయంలో 25 స్థానంలో మన రైతులు ఎందుకున్నట్లు? అని ప్రశ్నించారు.

దిక్కుమాలిన తొమ్మిదేళ్ల పాలనలో 8 వేల మంది రైతులను కేసీఆర్ పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. చేతకాని పాలనతో రైతులను నిండా ముంచారని విమర్శించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు లక్ష మాఫీ చేశామని గప్పాలు కొట్టే దొర.. మీరిచ్చే లక్షతో మాఫైంది రుణం కాదు దాని తాలూకా వడ్డీనే అని పేర్కొన్నారు. అసలు అప్పు ఇంకా రైతు నెత్తిన గుదిబండే అని ధ్వజమెత్తారు. కేసీఆర్ ముమ్మాటికి రైతు ద్రోహి అని, రైతుల పాలిట రక్షకుడు కాదు రాక్షసుడని, కేసీఆర్ రైతు భక్షక పాలన అంతమయ్యే సమయం దగ్గర పడిందని విమర్శించారు.

Tags:    

Similar News