కేసీఆర్ సీఎం తెలంగాణకా.. మహారాష్ట్రకా..? YS షర్మిల ఫైర్

కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా..? లేక మహారాష్ట్రకా? అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.

Update: 2023-06-27 11:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా..? లేక మహారాష్ట్రకా? అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పక్క రాష్ట్రానికి తరలిపోయిందని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో మహారాష్ట్రలో బందిపోట్లు సోకు రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రజలు ఓట్లు వేసిన పాపానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా మహారాష్ట్ర ప్రజలకు ఊడిగం చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా.. బందిపోట్లలాగా ఇక్కడి సంపదను కొల్లగొట్టి పక్క రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజానీకం బీఆర్ఎస్ దుర్మార్గాలను గుర్తించాలన్నారు.

ప్రజలను గాలికొదిలి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పక్క రాష్ట్రానికి వెళ్లిందంటే.. తెలంగాణపై కేసీఆర్ కున్న చిత్తశుద్ధి ఏంటో గమనించాలన్నారు. వెళ్లే దారిలో కూడా ఇక్కడి ప్రజలను అవస్థలకు గురిచేసిన దొంగలు ఈ బీఆర్ఎస్ నేతలని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో పాలన అటకెక్కిందన్నారు. తెలంగాణ గ్రామాలు సందర్శించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి తీరిక లేదు కానీ రాజకీయాల కోసం పక్క రాష్ట్రానికి వెళ్లే సమయం మాత్రం ఉందన్నారు.

ఇక్కడ తిరిగి సమస్యలు తెలుసుకోలేని బందిపోట్లు.. పక్క రాష్ట్రాల ప్రజలను ఉద్ధరిస్తామనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఇకనైనా మేల్కొని.. రాజకీయాలకు రంగులు మార్చే ఈ బీఆర్ఎస్ దొంగలను రాష్ట్రం నుంచే కాదు ఈ దేశం నుంచే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

Read more:

మొదటిసారి పేరు వెనుక ‘రెడ్డి’ అని పెట్టుకున్న షర్మిల.. అందుకు సంకేతమా?

Tags:    

Similar News